- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగ్గురు యాష్ ఆయిల్ విక్రేతలు అరెస్ట్
అక్రమంగా యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించారు.

దిశ, జూబ్లీహిల్స్ : అక్రమంగా యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ ,వెంకటగిరి ప్రాంతానికి చెందిన షేక్ అన్వర్(25) , అఖిల్(28) , సందీప్ (30) ముగ్గురు ఎలక్ట్రీషియన్ , ఇతర వృత్తుల్లో పనిమ చేస్తుంటారు. ముగ్గురు స్నేహితులు కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. వెంకటగిరి, స్రవంతి నగర్ లో గురువారం అర్ధరాత్రి 11.45 నిమిషాలకు ముగ్గురు నిందితులు యాష్ ఆయిల్ విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు తనిఖీ చేయగా ముగ్గురు పట్టుబడ్డారు. వీరి వద్ద 300 గ్రాములు యాష్ ఆయిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసుకుని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.






