- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైసమ్మ చెరువుకు ముప్పు.. సుందరీకరణ అటకెక్కినట్టే?
ఎవరు ఏమన్న నాకేంటి అన్నట్టు వాసవి నిర్మాణ సంస్థ యాజమాన్యం ప్రవర్తిస్తున్నానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, కూకట్‌పల్లి : ఎవరు ఏమన్న నాకేంటి అన్నట్టు వాసవి నిర్మాణ సంస్థ యాజమాన్యం ప్రవర్తిస్తున్నానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైడ్రా మందిలించిన, ఇరిగేషన్ శాఖ కేసులు నమోదు చేసిన వాసవి నిర్మాణ సంస్థ తీరు మారడం లేదనే వాదనలు ఉన్నాయి. నాలా కబ్జా చేసి నిర్మాణం చేపడుతుండటంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగప్రవేశం చేసి చివాట్లు పెడితే తమ బారికేడ్ల లోపల తూతూ మంత్రంగా నాలాలో పోసిన మట్టిని తొలగించి మమ అనిపించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువును కలుపుతూ ఉన్న నాలాకు అడ్డంగా వాసవి నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన బారికేడ్లు నాలా ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నాయి. రేకులు, ఇనుప రాడ్‌లకు తగిలి చెత్త పేరుకుపోయి ఉంది.
సుందరీకరణ అటకెకెక్కినట్టేనా..?
మైసమ్మ చెరువు సమీపంలోని భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న వాసవి నిర్మాణ సంస్థకు సోషల్ రెస్పాన్స్‌బిలిటి కింద జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్ అధికారులు మైసమ్మ చెరువు సుందరీకరణ పనులను అప్పగించారు. 2024 జులై 11న రాతపూర్వకంగా ఎంఓయూపై సంతకం చేశారు. ఇదిలా ఉండగా సుందరీకరణ పనులు చేపట్టాల్సిన వాసవి నిర్మాణ సంస్థ తమ నిర్మాణ పనులు ప్రారంభించే సమయంలో చెరువు సుందరీకరణ చేస్తున్నట్టు చెరువు పక్కనే ఖాళీ ప్రాంతంలో మట్టిని నింపారు. జేసీబీలతో మట్టి చదును చేసి హడావిడి చేశారు. చెరువుకు వెళ్లే దారిలో లేక్డెవలప్మెంట్ బై వాసవి గ్రూప్ అంటు బోర్డును ఏర్పాటు చేసి అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులను నమ్మించారు. కట్ చేస్తే ఎంఓయూ చేసుకున్న రెండు, మూడు నెలలు హడావిడి చేసిన వాసవి సంస్థ సుందరీకరణ పనులను నిలిపి వేసిందనే టాక్ వినబడుతుంది. చెరువు సమీపంలో ఉన్న ప్రైవేటు పట్టా భూములు ఉన్న వారు అడ్డుకుంటున్నారని సాకులు చెబుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలోనే ఎంతో పేరుగాంచిన బడా నిర్మాణ సంస్థ అయిన వాసవి గ్రూప్స్ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకునే సమయంలో ప్రైవేటు భూములు, భూముల సమస్యలు ఉంటాయని తెలియకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో అక్కడ ఏర్పాటు చేసిన బోర్డును సైతం వాసవి నిర్మాణ సంస్థ తొలగించిందని తెలిసింది.
ప్రమాదకరంగా గుంతలు..
వాసవి నిర్మాణ సంస్థ చెరువు సుందరీకరణ పేరుతో ఎక్కడపడితే అక్కడ మట్టి కుప్పలు, పెద్ద పెద్ద గుంతలు తవ్వి వదిలేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుంతలలో చేరిన నీటిలో సమీపంలోని స్లం ఏరియాకు చెందిన చిన్నారులు ఈత కొట్టుందుకు, ఆడుకునేందుకు వస్తున్నారు. ఏదైన సంఘటన జరిగితే బాధ్యతవహించేది ఎవరు? వాసవి నిర్మాణ సంస్థ నా? ఇరిగేషన్ విభాగమా? లేక జీహెచ్‌ఎంసీనా? ఎవరు సమాధానం చెబుతారనే ప్రశ్నలు స్థానికుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.






