రూ. 9.28 కోట్లు ప్రాఫిట్‌ను చూపించి రూ. 2 కోట్లు కొట్టేశారు!

by Kodari Anjali |   (  Updated:2026-01-04 14:34:40  IST  )

ఫేసుబుక్‌ను స్క్రోల్ చేస్తుంటే ఓ అప్లికేషన్ కనిపించింది.

రూ. 9.28 కోట్లు ప్రాఫిట్‌ను చూపించి రూ. 2 కోట్లు కొట్టేశారు!
X

దిశ, సిటీక్రైం: ఫేసుబుక్‌ను స్క్రోల్ చేస్తుంటే ఓ అప్లికేషన్ కనిపించింది. క్లిక్ చేసి 2 కోట్ల రూపాయాలను ఓ వ్యాపారీ పొగొట్టుకున్నాడు. కాగా మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..పెద్ద అంబర్‌పేట్ ప్రాంతానికి చెందిన వ్యాపారీ(37) ఫేస్‌బుక్‌ను స్క్రోల్ చేస్తున్నాడు. అందులో నోమురా సెక్యురిటీస్ అప్లికేషన్ కనిపించింది. క్లిక్ చేస్తే వాట్సాప్ కాల్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు మాట్లాడారు.

పెట్టుబడి పెట్టండి మీకు ఏలాంటి రిస్క్ లేకుండా భారీగా ప్రాఫిట్‌లను సంపాదించి పెడతామని నమ్మించారు. వారి మాటలను నమ్మిన వ్యాపారీ గత నవంబరు నుంచి జనవరి 1వ తేదీ వరకు దాదాపు 11 లావాదేవిల్లో 2 కోట్ల రూపాయాలను సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో జమచేశాడు. అతనికి కేటాయించిన ఖాతాల్లో మొత్తం 9.28 కోట్ల రూపాయాల ఆదాయాన్ని చూపించారు. విత్ డ్రాకు ప్రయత్నించగా.. ట్యాక్స్, చార్జీలంటూ కహానీలు చెప్పి ఇంకా డబ్బులను డిమాండ్ చేశాడు. చివరకు ఇక తాను మోసానికి గురయ్యానని గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Read More : రిటైర్డ్ అకౌంట్ ఆఫీసర్‌కు టోకరా.. రూ. 2.55 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Next Story