- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిటైర్డ్ అకౌంట్ ఆఫీసర్‌కు టోకరా.. రూ. 2.55 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
టెలిగ్రాం యాప్‌ను బ్రౌజింగ్ చేస్తూ రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్లకు చిక్కాడు.

దిశ, సిటీక్రైం: టెలిగ్రాం యాప్‌ను బ్రౌజింగ్ చేస్తూ రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్లకు చిక్కాడు. వారి మాటలను నమ్మి రూ. 2.55 కోట్లు పొగొట్టుకున్నాడు. ఈ చీటింగ్ రాచకొండ సైబర్ క్రైం పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం... ఏఎస్ రావు నగర్ బ్రుందావన్ కాలనీకి చెందిన రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి(60) టెలిగ్రాం యాప్‌ను బ్రౌజ్ చేస్తుండగా.. అతనికి ఏపీ హెల్పింగ్ హ్యాండ్ ఇండియా లింక్ కనపడింది. ఆ లింక్‌ను క్లిక్ చేయగా అతనికి ట్రేడింగ్‌లో పెట్టుబడితే భారీగా లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మించారు.
విత్ డ్రా ఆప్షన్ తీసేసి..
వారి మాటలకు బోల్తాపడ్డ రిటైర్డ్ ఉద్యోగి దాదాపు 494 లావాదేవిల్లో మొత్తం 2.55 కోట్ల రూపాయాలను పెట్టుబడిగా పెట్టాడు. గత నవంబరు నెల నుంచి ఈ ఏడాది జనవరి 1వ తేది వరకు డబ్బులను డిపాజిట్ చేశాడు. బాధితుడికి మొత్తం 9 కోట్ల రూపాయాలను లాభాలను అతనికి కేటాయించిన ప్రత్యేక పేజీలో నిరంతరం కనిపించేలా ఆకర్షించారు. కాని విత్ డ్రా ఆప్షన్ తీసేశారు. విత్ డ్రా సంప్రదించగా ట్యాక్స్‌లు, కమీషన్, చార్జీలంటూ మొత్తం ఊడ్చేశారు. చివరకు ఇదంతా మోసమని గ్రహించి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.






