- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు తవ్వి వదిలేశారు.. లబోదిబోమంటున్న వాహనదారులు...
అభివృద్ధి పనుల పేరిట రోడ్లు తవ్వేయడం, ఆ తర్వాత వాటిని అలాగే వదిలేయడం అధికారులకు అలవాటుగా మారింది.

దిశ, కార్వాన్ : అభివృద్ధి పనుల పేరిట రోడ్లు తవ్వేయడం, ఆ తర్వాత వాటిని అలాగే వదిలేయడం అధికారులకు అలవాటుగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఉదాసీనత రోడ్డున వెళ్లే ప్రయాణికులకు,స్థానికులకు శాపంగా మారింది. పైప్‌లైన్ పనుల పేరుతో తవ్వకాలు జరిపి, ఆ తర్వాత పనులు పూర్తి చేయకుండా సగంలోనే వదిలేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు ప్రారంభించిన సమయంలో తవ్వకాలు జరిపిన సిబ్బంది, ఆ తర్వాత అటువైపు చూడటమే మానేశారు. తవ్విన గుంతలను పూడ్చకపోవడంతో రోడ్డంతా గుంతలమయంగా మారి స్థానికులు ప్రమాదాల భారిన పడుతున్నారు. నాంపల్లి నియోజకవర్గంలోనీ ఆసిఫ్ నగర్ డివిజన్ న్యూ ఇందిరానగర్ లో నల్ల నీటి కోసం అధికారులు నూతన పైప్ లైన్ పనులను ప్రారంభించారు. పనులు మొదలు పెట్టినప్పటి నుంచి అధికారులు,కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం తో పనులు నత్త నడకన సాగుతూ వస్తున్నాయి. దారి పొడవునా తవ్వి వదిలేసిన గుంతలు, రోడ్డుపై పేర్చిన మట్టి దిబ్బల వల్ల ద్విచక్ర వాహనదారులు తరచూ జారిపడుతున్నారు. వర్షాల కారణంగా పైపులు బయటికి తేలి ప్రమాదకరంగా మారాయి. అధికారులకు స్థానికులు పలు మార్లు మొర పెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందనీ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా కొన్ని నెలలుగా గుంతలు కనపడక అనేకమంది ద్విచక్ర వాహనదారులు,స్థానికులు కిందపడి తీవ్రగాయాలపాలవుతున్నారు. రాత్రి వేళల్లో సరిపడా వీధి దీపాలు లేకపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. వర్షం పడితే గుంతల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీనివల్ల కాలినడకన వెళ్లే స్థానికులు, పాఠశాల పిల్లలు, వృద్ధులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు..
రోడ్డు పరిస్థితిపై స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తక్షణమే అధికారులు నిద్రమత్తు వీడి రోడ్డుతో పాటు, వీదీపాలను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






