- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ...

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం(Hyderabad GHMC Office) వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు(BRS Corporators) ఆందోళనకు దిగారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం(BRS Corporators GHMC Council meeting)లో తమ పార్టీ కార్పొరేటర్లపై కాంగ్రెస్ సభ్యులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్‌లో తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు. మేయర్ విజయలక్ష్మి(Mayor Vijayalakshmi) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్(Budget)ను ఆమె ఏకపక్షంగా ఆమోదించారని ఆరోపించారు. బడ్జెట్‌పై కౌన్సిల్‌లో చర్చించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎలా బడ్జెట్ ఆమోదించారంటూ ప్రశ్నించారు. మేయర్ చాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
కాగా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం గురువారం జరిగింది. అయితే ఈ సమావేశంలో గ్రేటర్ వార్షిక బడ్జెట్‌ను మేయర్ ఆమోదించారు. ఈ సందర్భంగా కౌన్సిల్‌లో చెదురుమదరు ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం తీరును నిరసిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బడ్జెట్‌పై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. మేయర్ ఛాంబర్‌ను చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీరుపై కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మండిపడ్డారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం వారి మధ్య తోపులాట జరిగింది. ఈ మేరకు కౌన్సిల్‌లోకి ఎంటరైన మార్షల్స్ బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే మేయర్ తీరుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కూడా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది.






