- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలా తయారేంట్రా బాబు.. ట్రీట్ మెంట్ పేరుతో చిన్నారిని కొట్టిన డాక్టర్.. కేసు నమోదు
ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో దారుణం చోటు చేసుకుంది.

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం వచ్చిన నాలుగేళ్ల చిన్నారిని ట్రీట్ మెంట్ పేరుతో కొట్టిన సంఘటన హబ్సిగూడలోని వైబ్రెంట్ వింగ్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో బుధవారం చోటు చేసుకుంది. చిన్నారి తల్లి ఇచ్చిన ఫీర్యాదు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటిజంతో బాధ పడుతున్న తమ చిన్నారిని చికిత్స నిమిత్తం వైబ్రింగ్ వింగ్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో జాయిన్ చేశారు.
థెరఫిస్ట్ రంజిత్ చిన్నారిని ట్రీట్ మెంట్ చేస్తున్నాం అంటూ.. కొడుతూ, గిచ్చుతూ హింసించాడు. ఫీజు రూ.60 వేల నుండి లక్ష వరకు చెల్లించినట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు.. చిన్నారిని కొట్టడంతో ఆమెకి రక్తం వచ్చేలా గాయాలు అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధిత చిన్నారి తలిదండ్రులు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






