- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షెడ్ కూలి వ్యక్తికి తీవ్రగాయాలు.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స..
భోలక్‌పూర్ మహాత్మానగర్ బస్తీ వద్ద బీఎం ట్రేడర్స్ లో షెడ్లను ( ఇనుప రేకులను ) పక్కకు జరుపుతుండగా అందులో పనిచేసే దీన్ దయాల్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

దిశ, ముషీరాబాద్ : భోలక్‌పూర్ మహాత్మానగర్ బస్తీ వద్ద బీఎం ట్రేడర్స్ లో షెడ్లను ( ఇనుప రేకులను ) పక్కకు జరుపుతుండగా అందులో పనిచేసే దీన్ దయాల్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం భోలక్‌పూర్ మహాత్మానగర్ బస్తీ వద్ద బీఎం ట్రేడర్స్ లో దీన్ దయాల్ (33) పని చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా బుధవారం ట్రేడర్స్ లో పాత ఇనుప రేకులను పక్కకు జరుపుతుండగా దీన్ దయాల్ ప్రమాదవశాత్తు రేకులకు మధ్యన ఇరుక్కుపోయాడు. ఇనుపరేకులు రావడంతో అతనికి గుచ్చుకుని రక్తస్రావం అయింది. ఊపిరాడకుండా ఇబ్బంది పడ్డాడని తెలిపారు. స్థానికులు శ్రమించి అతన్ని గంటతర్వాత బయటకుతీసి ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలతో దీన్ దయాల్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






