- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Old City News : అంధకారంలో పాతబస్తీ.. కారణం అదేనా?
హైదరాబాద్(Hyderabad) నగరంలోని పాతబస్తీ(Old City) బుధవారం రాత్రి గాఢాంధకారంలో మునిగిపోయింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలోని పాతబస్తీ(Old City) బుధవారం రాత్రి గాఢాంధకారంలో మునిగిపోయింది. ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉండే ఓల్డ్ సిటీలో ఒక్కసారిగా చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. అయితే వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025(Waqf Amendament Bill) కు వ్యతిరేకంగా ఆలిండియా ముస్లిం పర్సనల్ బోర్డ్ దేశవ్యాప్త ముస్లింలకు కీలక పిలుపునిచ్చింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి 9.15 మధ్య లైట్లు ఆర్పేసి చీకటితో నిరసన తెలపాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిలుపునందుకున్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ)Asadudhin Owaisi) సరిగ్గా రాత్రి 9 గంటల ప్రాంతంలో తన నివాసంలో లైట్లు అర్పివేశారు.
అయితే ముస్లిం బోర్డు పిలుపు మేరకు ఓల్డ్ సిటీలోని ముస్లింలు అందరూ తమ నివాసాల్లో, షాపుల్లోని లైట్లు ఆర్పివేయడంతో ఒక్కసారిగా చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. అయితే షాపింగులతో రద్దీగా ఉండే ఏరియాల్లో ఈ చీకటి ఎందుకు ఏర్పడిందో ముస్లిమేతర పౌరులకు అర్థంకాక, కాసేపు గందరగోళానికి గురయ్యారు. అనంతరం విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ తాము చేపట్టిన నిరసన విజయవంతం అయిందని ఒవైసీ పేర్కొన్నారు.






