రాజకీయాల్లో కొత్త దిశను చూపించిన నాయకుడు ఎన్‌టీఆర్ : ఎమ్మెల్యే న‌వీన్ యాద‌వ్

by Ratna Kumari |

సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి రాజకీయాల్లో కొత్త దిశను చూపించిన నాయకుడు ఎన్‌టీఆర్ అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే న‌వీన్ యాద‌వ్ పేర్కొన్నారు.

రాజకీయాల్లో కొత్త దిశను చూపించిన నాయకుడు ఎన్‌టీఆర్ : ఎమ్మెల్యే న‌వీన్ యాద‌వ్
X

దిశ, జూబ్లీహిల్స్ : సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి రాజకీయాల్లో కొత్త దిశను చూపించిన నాయకుడు ఎన్‌టీఆర్ అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే న‌వీన్ యాద‌వ్ పేర్కొన్నారు. అమీర్ పేట చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న మాజీ ముఖ్యమంత్రి, మహానేత నందమూరి తారక రామారావు (ఎన్‌టీఆర్) విగ్రహ ప్రతిష్టాపన పనులకు ఆదివారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ శంకుస్థాపన చేసి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయనతో పాటు కమ్మ సంఘం కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ , బీసీ జేఏసీ అధ్యక్షుడు వి.చిన్న శ్రీశైలం యాదవ్ కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. తెలుగు జాతి గర్వకారణమైన ఎన్‌టీఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడైన ఎన్‌టీఆర్ సేవలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మైత్రివనం కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు.ఈ విగ్రహం ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా ఉండటంతో పాటు, ఎన్‌టీఆర్ ఆశయాలను గుర్తు చేస్తుందని అన్నారు. భూమి పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు లవ కుమార్, కిలారి మనోహర్, సంజయ్ గౌడ్, నాగార్జున రెడ్డి, లక్ష్మణ్, సాయి నాథ్ యాదవ్‌, సురేఖ నాయకులు ఉన్నారు.

Next Story