గంజాయి మత్తులో యువకుల హల్ చల్

by Elthuri vijay kumar |

గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు రెజిమెంటల్ బజార్ లో వీరంగం సృష్టించారు.ఆకారణంగా ముగ్గురుపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు.

గంజాయి మత్తులో యువకుల హల్ చల్
X

గంజాయి మత్తులో యువకుల హల్ చల్

- రెజిమెంటల్ బజార్ లో నలుగురు యువకుల వీరంగం

- పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు, పరారీలో మరో ఇద్దరు

దిశ, బేగంపేట: గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు రెజిమెంటల్ బజార్ లో వీరంగం సృష్టించారు.ఆకారణంగా ముగ్గురుపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు.ఈఘటన సోమవారం సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం ఇదే ప్రాంతానికి చెందిన సాయి అనే ఓవ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి గంజాయి సేవించే అలవాటు ఉంది.మత్తులో ఉన్న ఈనలుగురు దారివెంట వెళ్తున్న ఓయువకుడిని నిలిపి ఆకారణంగా అతడితో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. దెబ్బలకు తాళలేక ఆ యువకుడు గట్టిగా అరుస్తూ వారి నుండి తప్పించుకుని పారిపోయాడు. ఇదే బ్యాచ్ గండి మైసమ్మ దేవాలయం పక్కనే ఉన్న హోటల్ వద్దకు వచ్చి హోటల్ లో పనిచేస్తున్న ఓ యువకుడితోపాటు, మరో యువకుడిపై దాడి చేసారు. చాయి తయారి చేసే పాత్రతో దాడి చేయడంతో వారికి గాయాలు అయ్యాయి. చుట్టుపక్కల వారు అడ్డుకునేందుకు ముందుకు రావడంతో వారిని మీ అంతు చూస్తామంటూ బెదిరించారు. మరికొంత మంది స్థానికులు వారిని ద్దరు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా మరో ఇద్దరు యువకులు పారిపోయారు. పోలీసులు వీరిని పోలీస్ స్టేషన్ కు తీసుకు రాగా ఇది మాకు అలవాటే ఇలా జైలుకు వెల్లి అలావస్తామంటూ గట్టగా అరుస్తుండంతో పోలీసులు, స్థానికులు అవాక్కయ్యారు.

Next Story