పసికందు హత్య చేసిన కసాయి తండ్రి..

by Bhanu |

ఓ కసాయి తండ్రి కూతురును కత్తితో గొంతు కోసి హతమార్చిన ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పసికందు హత్య చేసిన కసాయి తండ్రి..
X

దిశ, కార్వాన్ : ఓ కసాయి తండ్రి కూతురును కత్తితో గొంతు కోసి హతమార్చిన ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సైదులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .. నేపాల్ దేశానికి చెందిన జగత్, గౌరీ దంపతులు కొన్నేళ్ల క్రితం గోల్కొండ ప్రాంతానికి వలస వచ్చి క్రిస్టల్ అపార్ట్మెంట్లో ఉంటూ అక్కడే వాచ్మెన్ గా పని చేస్తు జీవనం సాగిస్తున్నారు. కాగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 14 రోజుల క్రితం గౌరీ మరో కుమార్తెకు జన్మనిచ్చింది. వారం రోజులుగా జగత్ అన్నం తినడం లేదు. ఈ క్రమంలో జగత్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలో జగత్ గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో 14 రోజుల పసికందును బయటకు తీసుకెళ్లి ఇంటి గేటు సమీపంలో కత్తితో గొంతు కోసి హతమార్చాడు. ఉదయం నిద్ర లేచిన గౌరీ కూతురు కోసం చూడగా జరిగిన విషయం వెలుగు చూసింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జగత్ ను అరెస్టు చేశారు.



Next Story