- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రచారం మాటున పొంచి ఉన్న ప్రమాదం..
అమీర్ పేటలోని అన్నపూర్ణ, నీలగిరి బ్లాక్ భవనాలను చుట్టేసిన ప్లెక్సీలు, హోర్డింగులు

ప్రచారం మాటున పొంచి ఉన్న ప్రమాదం..
- అమీర్ పేటలోని అన్నపూర్ణ, నీలగిరి బ్లాక్ భవనాలను చుట్టేసిన ప్లెక్సీలు, హోర్డింగులు
- అగ్నిప్రమాదం జరిగితే రక్షణ అంతంత మాత్రమే
- నిద్రమత్తులో ప్రభుత్వ యంత్రాంగం
- ప్రాణాలు పోతే కానీ పట్టించుకోరా?
దిశ, ఖైరతాబాద్ : నగరంలో చాలాచోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న అధికారులు మాత్రం నియంత్రణ చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారని చెప్పుకోవచ్చు… కనీసం ఎక్కువ జనసంచారం కలిగిన ఉన్న చోట భవనాలు , వ్యాపార సముదాయాలు వద్ద అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మరి వాటికి అగ్నిమాపక పరికరాలు , అనుమతులు ఉన్నాయా…ప్రమాదం సంభవించి ప్రాణ నష్టాన్ని కలిగించే వాటిని గుర్తించి వాటిపై ముందుగానే చర్యలు చేపడుతున్నారా అంటే చర్యలు శూన్యం అనే చెప్పవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఎక్కువ ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరుగుతున్నాయి.. అగ్ని ప్రమాదం సంభవించినపుడు వెంటిలేషన్ లేకపోవడం కారణంగా చాలా మంది మృత్యువాత పడుతున్నారు..
ప్రమాదకరంగా అమీర్ పేటలోని అన్నపూర్ణ, నీలగిరి బ్లాక్ భవనాలు
శాస్త్రసాంకేతిక రంగాలలో దినదిన అభివృద్ధి చెందుతున్న మహానగరం లో అమీర్ పేటకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి మన రాష్ట్రం నుండే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కాక విదేశాల నుంచి విద్యార్థులు, యువకులు వివిధ కోర్సుల నిమిత్తం కోచింగ్ సెంటర్లకు వస్తూ ఉంటారు…రాష్ట్రంలోనే అమీర్ పేట మైత్రివనం అంటే కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి గాంచిన జనసంచారం కలిగిఉండే ప్రాతం అలాంటి చోట అన్నపూర్ణ బ్లాక్ , నీలగిరి బ్లాక్ భవనాలు మొత్తం వెంటిలేషన్ కూడా లేకుండా అనుమతులకు మించిన హోల్డింగ్లతో నిండిపోయింది. అందులో చాలా వరకు విద్యుత్ తో కూడిన హోర్డింగులు ఏర్పాటు చేసుకున్నారు.. భవనంలో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్నిమాపక సిబ్బంది ప్రత్యామ్నాయ ధరిలేకుండా బాల్కనీ సైతం కప్పివేయబడినవి గతంలో షార్ట్ సర్క్యూట్ తో భవనంలోని 3వ అంతస్తులో చిన్నపాటి అగ్ని ప్రమాదం కూడా జరిగింది.. దీనిపై ప్రమాదం పొంచివుందని గతంలో కొందరు ఫిర్యాదులు చేశారు..2019లో జిహెచ్ఎంసి , ఇన్ఫోసిమెంట్ , ట్రాఫిక్ పోలీస్ , లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి అప్పటి జిహెచ్ఎంసి కమిషనర్ రెండు రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు 20వేల హోర్డింగ్ , బోర్డులు తీసివేశారు. తరువాత మళ్ళీ కొదిరోజులోనే కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు వారు ఎప్పటిమదిరిగానే భవనం మొత్తం హార్డింగ్లతో నింపేశారు.. ఆతరువాత 2019 నుండి 2025 ఇప్పటివరకు అధికారులు అటువైపు తొంగైన చూడలేదు. దీనిపైన అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యమేమి..? కింది స్థాయి సిబ్బంది కొందరు కోచింగ్ యాజమాన్యాలకు లోబడి పనిచేస్తున్నారనే ఆరోపణలు కూడా టాక్ వినిపిస్తున్నాయి.. ప్రాణాలు పోతే కానీ చర్యలు ఉండవా..? ఇప్పటికైన నిద్ర మేలుకొని పొంచి ఉన్న ప్రమాదాన్ని చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడ కుండా హోర్డింగ్ లను తలగించాలని సిటిజన్లు మండిపడుతున్నారు..
దారి ఎక్కడ..? :
కొన్ని కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటుచేసుకొని ఎక్కడపడితే అక్కడ రోడ్లపై వందల కొద్ది బోర్డులను ఏర్పాటు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. ఫుట్పాత్లపై బోర్డులను ఏర్పాటు చేస్తూ పాదచర్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అంతే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండే విధంగా ప్రభుత్వాలు నాటిన చెట్లను సైతం వదలకుండా మేకులతో చెట్టుకు గాయం చేసి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్ ప్రాంతం అంత ఏర్పాటు చేశారు. పర్యావరణం నష్టం కలిగించే వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటుంటారు…
వరసగా చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాలు :
ఒక్క ఈ సంవత్సరంలోనే జరిగిన ప్రమాదాలు చూసుకున్నట్లయితే మే 18న హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 8 మంది చిన్నారులతో సహా.. మెుత్తం 17 మంది మృతి చెందారు. మే 4న సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని ఎస్బిఐ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మే 9న హైదరాబాద్లోని చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ షాపింగ్ కాంప్లైక్స్లోని సెంట్రో చెప్పుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది.మంటలు వేగంగా విస్తరిస్తూ భవనం అంతా వ్యాప్తించాయి. వీటితో పాటు పక్కనే ఉన్న ఆర్కే సిల్క్ షాపునకు విస్తరించాయి. జూలై 3న 2 రాజరాజేశ్వరి నగర్‌లో ఫ్రిడ్జ్ పేలడం వల్ల ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది.. జూలై 17న నగరంలోని సనత్‌నగర్ సమతనగర్‌లో డ్యూరోడైన్ ఇండస్ట్రీస్ పరిశ్రమలోఅగ్ని ప్రమాదం జరిగింది.. ఆగస్టు 27న అమీర్పేట లో బాలాజీ నెయ్యి తయారీ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది..






