అబ్బుర‌ప‌రిచిన గుమ్మ‌డి భ‌న్వీ శివ‌తాండ‌వం

by velandi.Saikiran |

గుమ్మ‌డి భ‌న్వీ అభిన‌యించిన శివ‌తాండం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. గురుపూజోత్సవం ‌ సంద‌ర్భంగా న‌

అబ్బుర‌ప‌రిచిన గుమ్మ‌డి భ‌న్వీ శివ‌తాండ‌వం
X

దిశ, రవీంద్ర భారతి : గుమ్మ‌డి భ‌న్వీ అభిన‌యించిన శివ‌తాండం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. గురుపూజోత్సవం ‌ సంద‌ర్భంగా న‌గ‌రంలోని వివిధ నృత్య అకాడ‌మీకి చెందిన చిన్నారులు త‌మ నాట్య కౌశ‌లంతో అబ్బుర‌ప‌రిచారు. భార‌త్ ఆర్ట్స్ అకాడ‌మీ సంస్థ గురుపూజోత్స‌వం సంద‌ర్భంగా ర‌వీంధ్ర భార‌తీలో గుర‌దేవోభ‌వ పేరిట వివిధ పాఠ‌శాల‌లు, నృత్య అకాడ‌మీలకు చెందిన చిన్నారులు, క‌ళాకారుల‌తో నృత్య రూప‌కాల‌ను ప్రద‌ర్శించింది. ఇందులో నిజాంపేట ఏ.ర‌మాదేవి నృత్య అకాడ‌మీకి చెందిన విద్యార్థినులు, క‌ళాకారులు చేసిన కూచిపూడి నృత్య రూపకాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి.

ఇందులో భాగంగా నృత్య అకాడ‌మీకి చెందిన విద్యార్థిని చిరంజీవి గుమ్మ‌డి భ‌న్వీ చేసి శివ‌తాండవం నృత్య రూప‌కంతో ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేసింది. క‌ష్ట‌సాధ్య‌మైన శివ‌తాండ‌వాన్ని చిన్నారి సునాయసంగా అభియ‌న‌యించి చేసిన తీరు ఆహుతుల మ‌న్న‌న‌లు పొందింది. త‌ద‌నంత‌రం వివిధ క‌ళాకారులు బ్ర‌హ్మాంజ‌లి, అల‌లు కురియ‌గ‌, మూషిక వాహ‌న మోద‌క హ‌స్త అనే గ‌ణేశ్ శ్లోకాన్ని చిన్నారులు అభిన‌యించారు. అదివో అల్ల‌దివో త‌దిత‌ర గేయాల‌కు చేసిన కూచిపూడి అభిన‌యం అబ్బుర‌ప‌రిచాయి. చిన్నారులంతా కూచిపూడిలో తమ అభినయ కౌశలాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను మైమరపించారు. అనంత‌రం అద్భుతంగా నాట్యం చేసి అల‌రించిన చిన్నారి క‌ళాకారుల‌ను అతిథులు జ్ఞాపిక‌లు, ప్ర‌శంసాప‌త్రాల‌తో స‌త్క‌రించారు.

Next Story