CV Anand : అందుకే చైనా మాంజా కొంటున్నారు : సీపీ ఆనంద్

by Muthe.Rajitha |

చైనా మాంజా(China Manja)పై సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) కీలక వ్యాఖ్యలు చేశారు.

CV Anand : అందుకే చైనా మాంజా కొంటున్నారు : సీపీ ఆనంద్
X

దిశ, వెబ్ డెస్క్ : చైనా మాంజా(China Manja)పై సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్(Hyderabad) లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజానికి చైనా మాంజా అక్కడి నుంచి దిగుమతి అవడం లేదని, స్థానికంగానే తయారు చేస్తున్నారని అన్నారు. అందువల్లనే పెద్ద మొత్తంలో మాంజా తక్కువ ధరకు లభ్యం అవుతోందని, ఈ కారణం వల్లే ఎక్కువమంది కొంటున్నారని వెల్లడించారు. ఈ మధ్య ఈ-కామర్స్(E-Commerce) సైట్స్ లో బుక్ చేసుకుంటే ఇంటికే తెచ్చి ఇస్తున్నారని, త్వరలో ఈ-కామర్స్ గోడౌన్స్ రైడ్స్ చేస్తామని సీపీ పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే చైనా మాంజా వాడకాన్ని అరికట్టగలమని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా చైనా మాంజా వినియోగాన్ని మానేయాలని ప్రజలకు తాను రిక్వెస్ట్ చేస్తున్నానని అన్నారు.

Next Story