- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ
by Naga Rani Yarlagadda |
హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 17 రోజులపాటు నగరవాసులకు 24 గంటల టికెట్ పై రాయితీ ప్రకటించింది. ప్రకటించిన రాయితీ నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. తగ్గించిన ట్రావెల్ యూజ్ యూ లైక్ (TAYL) టికెట్ ధరలు 15 నుంచి 31 వరకూ అందుబాటులో ఉంటాయని తెలిపింది. మెట్రో డీలక్స్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 24 గంటల టికెట్లపై రాయితీ అందిస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. 24 గంటల జర్నీ టికెట్ పెద్దలకు గతంలో రూ.150 ఉండగా.. ఇప్పుడు రూ.130కి అందిస్తున్నారు. అలాగే మహిళలు, సీనియర్ సిటిజన్లకు ఇంతకుముందు రూ.120 ఉండగా.. రూ.110కే ఇస్తున్నారు. పిల్లలకు రూ.100 ఉండగా రూ.90కే 24 గంటల జర్నీ టికెట్ అందిస్తోంది టీజీఎస్ ఆర్టీసీ.
Next Story






