టీజీఓ కార్మికశాఖ నూతన కార్యవర్గం ఏర్పాటు

by velandi.Saikiran |

టీజీఓ కార్మిక శాఖ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా బీ జాసన్ , కార్యదర్శిగా శ్యాంసుందర్ జాజు ఎన్ని

టీజీఓ కార్మికశాఖ నూతన కార్యవర్గం ఏర్పాటు
X

దిశ , హైదరాబాద్ బ్యూరో: టీజీఓ కార్మిక శాఖ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా బీ జాసన్ , కార్యదర్శిగా శ్యాంసుందర్ జాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు బుధవారం నాంపల్లి లోని టీజీవో కార్యాలయంలో టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ ల ఆదేశాలతో ఎన్నికల అధికారిగా పి. శ్రీరామ్ రెడ్డి, సహాయ ఎన్నికల అధికారిగా డాక్టర్ రామా రావులు వ్యవహరించి ఎన్నికలను నిర్వహించారు. సంఘం సహ అధ్యక్షుడుగా ఎన్ చంద్రశేఖర్ గౌడ్, కోశాధికారిగా కె. యాదయ్య, ఉపాధ్యక్షుడుగా ఎస్. శ్రీనివాస రావు, సహకార్యదర్శులుగా కె. రవీందర్ రెడ్డి , ఏ. సత్యనారాయణ రెడ్డి ఎన్నికయ్యారు.

కార్యనిర్వాహక కార్యదర్శిగాసి. హెచ్. వెంకట్ రెడ్డి, ప్రచార కార్యదర్శిగా కె. వినీల, క్రీడల కార్యదర్శిగా కె. రాజు, కార్యవర్గసభ్యులుగా ఎస్. వెంకటరమణ, జి ప్రభాకర్, ఎం.డి. నిజాముద్దీన్, జి. వినోద్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో నూతన కార్యవర్గానికి ఏలూరి శ్రీనివాసరావు, ఏ సత్యనారాయణ, సహ అధ్యక్షుడు బీ శ్యాం చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు . ఈ సందర్భంగా వారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందించారు . కేంద్ర సంఘం చేసే ఆదేశాల మేరకు పని చేయాలని సూచించారు . నూతన కార్యవర్గానికి తమ సహకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు .

Next Story