- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HCA రద్దు చేయండి : TGCA కార్యదర్శి గురువారెడ్డి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన అవినీతి ఆరోపణలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన అవినీతి ఆరోపణలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హెచ్సీఏ సిటీకి మాత్రమే పరిమితమైందని, రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి దోహదం చేయడం లేదని విమర్శించారు. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా అవినీతి జరుగుతోందని, బీసీసీఐ నుంచి వచ్చే నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తప్పుడు లెక్కలు చూపించారని, ఈ అవినీతి వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని, వారి వివరాలను బయటపెడతానని గురువారెడ్డి హెచ్చరించారు. ఈ అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని టీసీఏ ఫిర్యాదు చేసింది. హెచ్సీఏను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
కాగా తెలంగాణ సీఐడీ హెచ్సీఏ అధ్యక్షుడు ఎ. జగన్‌మోహన్ రావు, ట్రెజరర్ సీజే శ్రీనివాస రావు, సీఈవో సునీల్ కాంతే, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, క్లబ్ అధ్యక్షురాలు జీ. కవితలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో రూ.2.32 కోట్ల నిధుల దుర్వినియోగం అయ్యాయని, గౌలీపుర క్రికెట్ క్లబ్ (పేరు శ్రీ చక్ర క్రికెట్ క్లబ్‌గా మార్చబడింది) సభ్యత్వం కోసం జగన్‌మోహన్ రావు నకిలీ పత్రాలు సృష్టించారని సీఐడీ తెలిపింది. అలాగే 2025 ఐపీఎల్ సీజన్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టును అదనపు టికెట్‌ల కోసం బెదిరింపులు, కార్పొరేట్ బాక్స్‌ల యాక్సెస్ కోసం జగన్‌మోహన్ రావు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.






