- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News: ఆర్టీసీ జేఏసీ సంచలన డిమాండ్
ఆర్టీసీ జేఏసీ సంచలన డిమాండ్ చేసింది..

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయడంతో పాటు, ప్రైవేటు ఏజన్సీల ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్, డ్రైవర్లను నియమించే విధానం మానుకోవాలని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ డిమాండ్చేసింది. ఇటీవల సచివాలయంలో జేఏసీ నాయకులతో జరిగిన చర్చల సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలలో యూనియన్ల పునరుద్ధరణ కూడా ఉందని జేఏసీ చైర్మన్ఈదురు వెంకన్న, వైస్చైర్మన్థామస్రెడ్డి తెలిపారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఆర్టీసీ యాజమాన్యం వెల్ఫేర్ బోర్డ్ మీటింగ్ గురించి సర్క్యులర్ జారీచేయడం పుండు మీద కారం చల్లి నట్లుగా ఉందని, ఈ సర్కులర్ తో ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అడ్డు పడే విధంగా ఉందని జేఏసీ భావిస్తుందన్నారు. విద్యుత్ బస్సులను కేంద్ర ప్రభుత్వంతో నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలతో ఈ బస్సులు తీసుకొస్తే సహించమని ఈ చర్యలతో ప్రభుత్వం మీద కార్మికులకు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రభుత్వం మీద నమ్మకంతో సమ్మె వాయిదా వేసుకున్నామని, వారు ఇచ్చిన హామీలు కొన్ని పరిష్కారం అవుతాయని వేయి కళ్ళతో కార్మిక వర్గం ఎదురు చూస్తున్న సమయంలో ఎండీ ఇటువంటి సర్క్యులర్ ద్వారా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో ఎన్నడూ లేని విధంగా ప్రవేటు ఏజన్సీల ద్వారా ఔట్ సోర్సింగ్ పద్దతిలో కండక్టర్, డ్రైవర్లను నియమించడం, ప్రవేట్ బస్సులను నడపడం, గ్యారేజ్ లు మొత్తం ప్రవేటు చేయడం, రిటైర్డ్ అయినా అధికారులను ఖాళీలల్లో నింపడం వంటివి ఈ ఆర్టీసీనీ ప్రవేటు పరం చేయడానికేనని వెంటనే ఔట్ సోర్సింగ్ నియమాకాలు ఆపాలని లేకుంటే మళ్ళీ సమ్మె బాట పడుతామని హెచ్చరించారు. ఆర్టీసీ యాజమాన్యం కవ్వింపు చర్యలు విడనాడాలని, మొన్నటి సమ్మె కేవలం వాయిదా మాత్రమేనని విరమణ కాదని గుర్తు చేశారు. జూన్ 2 తేదీ వరకు ప్రభుత్వం జేఏసీకి ఇచ్చిన హామీలు అమలు చేయని పక్షంలో మళ్ళీ ఆందోళనకు సిద్ధమైతామని, దీనికి పూర్తి భాద్యత ఆర్టీసీ యాజమాన్యం వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు.






