- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవుల కవిత్వమే తెలంగాణ భవిష్యత్ బాట… ఎమ్మెల్సీ కవిత తెలిపిన కీలక సందేశం
జూన్ 2న తెలంగాణ యువకుల కోసం రాజీవ్ యువ వికాస్ పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారని, రాజీవ్ గాంధీకి తెలంగాణ తో ఏమి సంబంధం ఉందని తాము ప్రశ్నించామని, తెలంగాణ అమరవీరుల పేరు పెట్టాలని ప్రతిపాదించామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

దిశ, హిమాయత్ నగర్ : జూన్ 2న తెలంగాణ యువకుల కోసం రాజీవ్ యువ వికాస్ పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారని, రాజీవ్ గాంధీకి తెలంగాణ తో ఏమి సంబంధం ఉందని తాము ప్రశ్నించామని, తెలంగాణ అమరవీరుల పేరు పెట్టాలని ప్రతిపాదించామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కానీ ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారని, ఇది జాగృతి విజయం అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన శ్రీకాంతా చారి, యాదిరెడ్డి సువర్ణ పేర్లు పెట్టారని ఆమె సూచించారు. సోమవారం తెలంగాణ సారస్వత పరిషత్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ యువ కెరటాలు పేరిట యువ కవుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కానీ ఇందులో దాగున్న కుట్రను ప్రజలు గమనించాలని, తాను గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే ప్రశ్నించాను. ప్రజల పక్షాన ఎప్పుడు తాను ప్రశ్నిస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. చిన్న పిల్లలు బతుకమ్మ పాటలు నేర్చుకుంటే బతుకమ్మ వందేళ్లు బతికి ఉంటదని, యువ కవులు కవితలు రాస్తే తెలంగాణ సాహిత్యం వందేళ్లు బతికి ఉంటదని కవిత అన్నారు.
తెలంగాణ తల్లి రూపశిల్పి బీవీఆర్ చారి పుట్టిన రోజు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఒకే రోజు కావడం సంతోషకరం అన్నారు. సాహిత్యం, సంస్కృతి వర్ధిల్లిన నేల బాగుంటుందని తెలిపారు. 35 ఏళ్ల లోపు వయసున్న యువ కవులు అన్ని భాషల్లో కవిత్వం రాయాలనే ఆకాంక్ష తో ఈ కవి సమ్మేళనం నిర్వహించమని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలకు ధిక్కారం ఎలా ఉంటుందో మమకారం కూడా అంతే ఉంటుందన్నారు. కవులు ఏ పాలకుడి ముందు కూడా తలవంచకూడదు. పాలనలో లోపాలను ఎత్తి చూపాల్సిందేనని స్పష్టం చేశారు. నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడే నిజమైన కవి అని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో యువత ఆత్మ బలిదానాలను కవులు తమ కవితల ద్వారా చెప్పేవారని, భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి కోసం మన నీళ్లు, వనరుల రక్షణ పై కవిత్వం రావాలన్నారు. కవులపై ఉన్న బాధ్యత పెద్దది. సమాజాన్ని సరైన బాటలో నడిపేదే కవిత్వం అని, తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలు జాగృతి ఆధ్వర్యంలో చేయాల్సి ఉందని, దానికి మీ సహకారం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాలేశ్వరం శంకరం, చమన్, గొల్ల శివశంకర్, రమేష్ నాయక్, పాల్గొన్నారు.






