Khairatabad Ganesh :వినాయకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: గవర్నర్ తమిళిసై

by S Gopi |   (  Updated:2022-08-31 07:21:17  IST  )

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి....Telangana Governor Tamilisai Visits Khairatabad Ganesh

Khairatabad Ganesh :వినాయకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: గవర్నర్ తమిళిసై
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ వినాయకుడు పంచముఖ మహాలక్ష్మి విఘ్నేషుడిగా దర్శనమిస్తున్నాడు. ఈ లంబోధరుడిని తొలి పూజలో గవర్నర్ తమిళిసై పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరికీ ఆమె వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ భారీ వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు పలువురు ప్రముఖులు ఖైరతాబాద్ లంబోధరుడిని దర్శించుకున్నారు.

Next Story