గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం ప్రభుత్వానికి కృతజ్ఞతలు

by velandi.Saikiran |

రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారమే

గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం ప్రభుత్వానికి కృతజ్ఞతలు
X

దిశ, శేరిలింగంపల్లి : రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం – 2025 అమలులోకి తీసుకురావడంతో పాటు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా జీపీవోలకు నియామక పత్రాలను అందించడం వలన గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని లచ్చిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆనవాళ్ళు కోల్పోయిన రెవెన్యూ శాఖను పునర్నిర్మాణం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరుపున, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ తరుపున, తెలంగాణ తహాసీల్దార్స్ అసోసియేషన్ తరుపున, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

అలాగే సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో దేశంలో ఎక్కడా కూడా లేని సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను సృష్టించడం, రెవెన్యూ ఉద్యోగుల పదోన్నతులు కల్పించడం, ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులందరం రుణపడి ఉంటామని తెలిపారు. అలాగే సర్వేయర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు లైసెన్సుడ్ సర్వేయర్ లను నియమించేందుకు ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్ల గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు ప్రజలకు, రైతులకు మెరుగైన సేవలు నిర్ణీత కాలంలో అందుతాయని అన్నారు.

అలాగే రెవెన్యూ ఉద్యోగులకు అండగా ఉంటానని సీఎం చెప్పడంతో జీపీవోలతో పాటు రెవెన్యూ శాఖ ఉద్యోగులందరూ రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తామని లచ్చిరెడ్డి తెలిపారు. జీపీవోల నియామక సభలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ, టీజీటీఏ అధ్యక్ష కార్యదర్శులు రాములు, పాక రమేష్ , టీజీఆర్ఎస్ఏ అధ్యక్ష కార్యదర్శులు బాణాల రామ్ రెడ్డి, బిక్షం, టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, టీజీటీఏ రాష్ట్ర నాయకులు పూల్ సింగ్, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర కోశాధికారి మల్లేష్, సీసీఎల్ఏ నాయకులు రాంబాబు, చైతన్య, సుజాత చౌహాన్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story