దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ కులగణన సర్వే : మంత్రి పొన్నం

by Bhanu |   (  Updated:2025-05-04 14:41:15  IST  )

దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ కులగణన సర్వేచేసిందని, కిషన్ రెడ్డి కి తెలవడం లేదని బీసీ సంక్షేమ, రవాణా శాఖ ల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ కులగణన సర్వే : మంత్రి పొన్నం
X

దిశ, రవీంద్ర భారతి : దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ కులగణన సర్వేచేసిందని, కిషన్ రెడ్డి కి తెలవడం లేదని బీసీ సంక్షేమ, రవాణా శాఖ ల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జనాభా లెక్కలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం కి ఉంది. కులాల లెక్కలు తేల్చే అధికారం రాష్ట్రానికి ఉందని ఆయన అన్నారు. రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సగర భగీరథ మహర్షి జయంతోత్సవం తెలంగాణ సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్ అధ్యక్షతన జరిగిన సభ కు ముఖ్య అతిథిగా పాల్గొని పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఆచరణ సాధ్యం కానిది. ప్రయత్నం చేస్తుంటే దానిని భగీరథ ప్రయత్నం అంటారు అని ఆయన తెలిపారు. విద్య వల్లనే ఉన్నత శిఖరాలకు ఎదుగగలుగుతాం అని,

తాను విద్యార్థి సంఘ రాజకీయాల్లో కాలేజి సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికై 36 సంవత్సరాలుగా అనేక ఉద్యమాల్లోపాల్గొని ఈరోజు ఇక్కడ ఉన్నానని పేర్కొన్నారు. మీరు రాజకీయంగా ఎదగాలంటే సగరులు ఐక్యంగా ఉండాలన్నారు. కష్టపడి పనిచేసే శక్తి ఉంది. భగీరథ సాధ్యం చేసుకున్నటువంటి స్పూర్తితో శాసనసభలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేలా మీరు ముందుకు పోవాలనీ ఆయన సూచించారు. రాజకీయంగా ఐక్యత ఉండాలని, మీకు ఐక్యత ఉంటే ప్రభుత్వమే మిమ్మల్ని పిలిచి ఏం కావాలో ఇస్తుందన్నారు. భారత్ జోడోయాత్ర సందర్భంగా సామాజిక న్యాయం జరగాలని జిత్నే అబాధి ఉత్నే ఇసిదరి అని చెప్పి తెలంగాణలో కులగణన చేసిందన్నారు. సామాజిక పరంగా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేయడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు పోతున్నామని వివరించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కంచే ఐలయ్య ను కలిసి మీ సామాజిక పరిస్థితులు వివరించాలని వారి ఆయన సూచించారు. సగర సంఘం కి అండగా ఉంటారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్, బాలరాజ్ గౌడ్, వెంకన్న గౌడ్, విజయ్ కుమార్ గౌడ్, మణి మంజలి, పల్లవి, మారుతి సాగర్, కుందాల గణేష్ చారి తదితరులు పాల్గొన్నారు.


Next Story