- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పది’ పరీక్షలకు వేళాయే..ఈ నిబంధనలు కచ్చితంగా తెలుసుకోండి
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగనున్నాయి.

‘పది’ పరీక్షలకు వేళాయే
- రేపటి నుంచి ఎగ్జామ్స్
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
దిశ , హైదరాబాద్ బ్యూరో: పదో తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. డీఈవో రోహిణి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసి పరీక్షలు సజావుగా సాగేందుకు అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. ఓ వైపు ఎండలు మండుతుండగా.. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందుల పాలు కాకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్ధేశిత సమయాని కంటే 5 నిమిషాలు ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి క్యాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అనుమతించరు. పెన్, పెన్సిల్, రబ్బర్, హాల్ టికెట్లను మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమస్తారు. సీసీ కెమెరాల నిఘాలో విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రతి సెంటర్‌కు ఇద్దరు కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించనున్నారు.
362 పరీక్షా కేంద్రాలు.. 78,465 మంది విద్యార్థులు..
హైదరాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం మొత్తం 362 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 78,465 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు మొదలై.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. పరీక్షలు
రాసే విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపనున్నది. పరీక్షా కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీరు అందుబాటులో ఉంచారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు జిల్లా ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాల సందర్భంగా సూచించారు. ఈ పరీక్షల కోసం వైద్య, పోలీస్, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్ శాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమన్వయం అందించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనునుండగా.. ప్రశాంత వాతావరణంలో ముగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షలు జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లను ముందుగానే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును ఉన్నతాధికారులు పరిశీలించేందుకు గాను 362 సెంటర్లలో ఒక్కో సెంటర్‌లో ఒకటి చొప్పున 362 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
సిట్టింగ్ స్క్వాడ్ లు..
జిల్లాలో పదో తరగతి పరీక్షలను 38 పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒకరు చొప్పున 362 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 362 మంది డిపార్ట్ మెంటల్ అధికారులు, 260 మంది విద్యార్థులకంటే అధికంగా ఉన్న సెంటర్లలో అదనంగా మరో 10 మంది డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లు, 14 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ లు,78 మంది కస్టోడియన్స్, 3,983 మంది ఇన్విజిలేటర్లు, 14 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 14 మంది పోలీస్ అధికాలరులను ఫ్లయింగ్ స్క్వాడ్ లుగా, 362 మంది ఏఎన్ఎంలను పరీక్షల నిర్వహణ కోసం నియమించారు.
సజావుగా సాగేందుకు చర్యలు..
హైదరాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతవాతావరణంలో సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. నిర్ధేశిత సమయం తర్వాత ఐదు నిమిషాలలోపు వచ్చే వారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ నిబంధన విద్యార్థులతో సహా సిబ్బందికి కూడా వర్తిస్తుంది. తనిఖీకి వచ్చే అధికారుల సెల్ ఫోన్లను సైతం లోనికి అనుమతించరు. పరీక్షకు వచ్చేముందు విద్యార్థులు తమ హాల్ టికెట్లు, పెన్నులు తప్పనిసరి చెక్ చేసుకొని వెంట తెచ్చుకోవాలి.
- రోహిణి, డీఈవో






