- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ తరుణంలోనే స్కై ఫాండషన్ ఆధ్వర్యంలో

దిశ, వెబ్ డెస్క్ : స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ తరుణంలోనే స్కై ఫాండషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేసి సర్టిఫికెట్స్, మెమొంటోస్, అవార్డులు అందించారు. అనంతరం స్కై ఫౌండేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డాక్టర్. వై. సంజీవ కుమార్ మాట్లాడుతూ... అమ్మ తరహాలోనే చిన్నారుల ఆలనా, పాలన చేసే సేవలు చాలా అద్భుతం అని కొనియాడారు.
కష్టాలు ఓర్చుకొని, ఓర్పుగా సేవలు అందిస్తున్న అంగన్వాడీ ఉపాధ్యాయులను ఎవరూ గుర్తించకున్నా...స్కై ఫౌండేషన్ గుర్తిస్తుందన్నారు. మా జీవితంలో పొందలేని సంతోషాన్ని కలిగించి, అవార్డు పొందడం పట్ల అంగన్వాడీ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారని తెలిపారన్నారు వై. సంజీవ కుమార్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ హాస్య నటులు గౌతమ్ రాజు, ప్రెసిడెంట్ డాక్టర్. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని, సభ్యులు అఖిల్. సాయి పాల్గొన్నారు.






