మృతుడి కుటుంబాన్ని ఆదుకున్న టాటా ఏఐఏ ఇన్సూరెన్స్

by Bhoopathi Nagaiah |

ఇంటి యజమానిని కోల్పోయి నిరాశ్రయులు అయిన కుటుంబానికి ఆర్థిక భరోసాని ఇచ్చేది ఒక్క ఇన్సూరెన్స్ మాత్రమేనని, అందుకే ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్‌ను చేసుకోవాలని ఐపీఎస్ మాజీ అధికారి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.

మృతుడి కుటుంబాన్ని ఆదుకున్న టాటా ఏఐఏ ఇన్సూరెన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంటి యజమానిని కోల్పోయి నిరాశ్రయులు అయిన కుటుంబానికి ఆర్థిక భరోసాని ఇచ్చేది ఒక్క ఇన్సూరెన్స్ మాత్రమేనని, అందుకే ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్‌ను చేసుకోవాలని ఐపీఎస్ మాజీ అధికారి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్ TATA AIA లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీసులో మృతుడు భానోత్ కిషన్ కుటుంబానికి క్లెయిమ్ చెక్కు అందజేసి మాట్లాడారు. TATA AIA లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్న టర్మ్ ఇన్సూరెన్స్‌ కుటుంబానికి అండగా నిలవడంలో ముందుంటుందన్నారు. ప్రతి వ్యక్తి టర్మ్ పాలసీని తీసుకొని తన కుటుంబానికి ఆర్థిక భరోసాని కల్పించాలని కోరారు. ఇన్పూరెన్స్ ద్వారా ఆర్థిక క్రమశిక్షణతోపాటు కుటుంబ భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తుందన్నారు. భానోత్ కిషన్ ముందుచూపుతో ఇన్సూరెన్స్ తీసుకోవడంతోనే ఇవాళ ఆయన కుటుంబం కొంత ఆర్థికంగా నిలబడగలిందన్నారు.

ఒక్క ప్రిమియంతోనే రూ.6 లక్షల చెల్లింపు..

మహారాష్ట్రాలోని చంద్రాపూర్ జిల్లా రాజుర మండలం ముండిగేట్ గ్రామానికి చెందిన భానోత్ కిషన్ జనవరిలో TATA AIA లైఫ్ ఇన్సూరెన్స్ ఏడాదికి రూ.50 వేల ప్రిమియం చెల్లించి పాలసీ తీసుకున్నాడు. ఒక్కటే ప్రిమియం చెల్లించిన ఆయన గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న TATA AIA లైఫ్ ఇన్సూరెన్స్ కాగజ్ నగర్ ఏజెంట్ గుగులోత్ రజిత నామిని అయిన మృతుడి భార్య భానోత్ జ్యోతికి క్లెయిమ్ అందించే ఏర్పాట్లు చేశారు. సోమవారం జ్యోతిని దిల్‌సుఖ్ నగర్ బ్రాంచి ఆఫీసుకు తీసుకువచ్చి బ్రాంచి ఇన్సూరెన్స్ అధికారులు, ఆర్ఎస్పీ చేతుల మీదుగా రూ.6 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్న ఏజెంట్లను ప్రశంసించారు.

అనంతరం సీనియర్ బిజినెస్ అసోసియేట్ కందికంటి విజయ్ కుమార్ మాట్లాడుతూ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిబద్ధతను మరియు త్వరగా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో వేగవంతమైన సేవలను ప్రదర్శించిందన్నారు. ఇన్సూరెన్స్ చేసుకునే కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం అందించే లక్ష్యాన్ని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బలపరుస్తుందని తెలిపారు. వినియోగదారులకు సేవలు అందించడంతో టాటా ఎప్పుడూ ముందుంటున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శ్యామ్ రావు, మేనేజర్ నున్న మురళి, చీఫ్ బిజినెస్ అసోసియేట్ శ్రీధర్ మాల్యల, బిజినెస్ అసోసియేట్ లీడర్లు ఎర్రమంజుల మహేష్, కొంగరి అరుణ, కొంకటి శేఖర్, బోనగిరి ప్రభాకర్, యాపచెట్టు యాదగిరి, ఏజెంట్ గుగులోత్ రజిత, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story