- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాణ్యత లేని కొబ్బరి పొడి తయారీ కేంద్రం పై టాస్క్ ఫోర్స్ దాడి
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ నాణ్యత లేని కొబ్బరి పొడిని విక్రయిస్తున్న అక్రమ తయారీ కేంద్రం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.

దిశ, కార్వాన్ : ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ నాణ్యత లేని కొబ్బరి పొడిని విక్రయిస్తున్న అక్రమ తయారీ కేంద్రం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒకరిని అరెస్ట్ చేసి నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బేగం బజార్ ప్రాంతానికి చెందిన నకుల్ మరోటియా (31) అనే వ్యక్తి కొబ్బరి వ్యాపారి. కర్ణాటక నుంచి తక్కువ ధరకే నాణ్యత లేని కొబ్బరి పొడిని కొనుగోలు చేసి దానిని చేతక్ బ్రాండ్ ఫ్యాకెట్లలో నింపి బేగం బజార్ లోని బాలాజీ పురుషోత్తం కొకొనట్ బిజినెస్ పేరుతో ఉన్న షాపులో నకిలీ ఉత్పత్తులను అసలైనవిగా నమ్మిస్తూ ప్రజలకు విక్రయిస్తూ లాభాలు పొందేవాడు. విశ్వసనీయ సమాచారం మేరకు గోల్కొండ, ఖైరతాబాద్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి సీజ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని సుమారు రూ.21 లక్షల విలువ చేసే 8,300 కిలోల నాణ్యత లేని కొబ్బరి పొడి, 3 ఫ్యాకింగ్ యంత్రాలు, 3 బరువు తూచే యంత్రాలు, 400 ఫ్యాకింగ్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.






