- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వేరో నూతన కమిటీ ఎన్నిక.. రాష్ట్ర అధ్యక్షుడిగా వీరయ్య
అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ధ్యేయంగా జ్ఞాన సమాజ నిర్మాణం కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరో సంస్థ నూతన కమిటీని ఎన్నుకున్నారు..

దిశ, తెలంగాణ బ్యూరో: అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ధ్యేయంగా జ్ఞాన సమాజ నిర్మాణం కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరో సంస్థ నూతన కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ స్వేరో రాష్ట్ర చీఫ్ కన్వీనర్ బల్గురి దుర్గయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సోమవారం స్వేరో నూతన రాష్ట కమిటీ ఎన్నిక జరిగింది. స్వేరో రాష్ట్ర అధ్యక్షుడిగా చిలకబత్తిని వీరయ్య నియామకమయ్యారు. ప్రధాన కార్యదర్శిగా దారమల్ల ప్రకాశ్, రాష్ట్ర కోశాధికారిగా లక్నారపు శ్రీనివాస్, అధికార ప్రతినిధి ప్రణీత శుభశ్రీ, ఉపాధ్యక్షులుగా మచ్చ నర్సయ్య, శ్యామల, అజయ్, జగన్ ఎన్నికయ్యారు. కార్యవర్గసభ్యులుగా పులేందర్, రాజు, సాయన్న, దిలీప్, మౌనిక, కిరణ్, కపిల్, రవి, మారుతి, సురేష్, రాజు, మనోజ్, ప్రవీణ్, పవన్ రాజ్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారమల్ల ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మామిడాల ప్రవీణ్, వైస్ చైర్మన్ బాల ప్రసాద్, ఉషన్న, ఎర్రోళ్ల సత్యం, పుల్ల కిషన్, గడప రాజు పాల్గొన్నారు.






