8 మంది చిన్నారుల ఉసురు తీసిన వేసవి సెలవులు...?

by Bhanu |   (  Updated:2025-05-18 11:52:10  IST  )

వేసవి సెలవులు చిన్న్నారుల ఉసురు తీశాయి . గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందగా వారిలో 8 మంది ఎనిమిదేళ్ల వయస్సు లోపు వారు ఉన్నారు. పాఠశాలలకు ఎండాకాలం సెలవులు ఇవ్వడంతో నగరంలోని అత్తాపూర్, బంజారాహిల్స్ ప్రాంతాల నుండి గుల్జార్ హౌస్ ప్రహ్లాద్ (70) ఇంటికి వచ్చారు.

8 మంది చిన్నారుల ఉసురు తీసిన వేసవి సెలవులు...?
X

దిశ , హైదరాబాద్ బ్యూరో: వేసవి సెలవులు చిన్న్నారుల ఉసురు తీశాయి . గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందగా వారిలో 8 మంది ఎనిమిదేళ్ల వయస్సు లోపు వారు ఉన్నారు. పాఠశాలలకు ఎండాకాలం సెలవులు ఇవ్వడంతో నగరంలోని అత్తాపూర్, బంజారాహిల్స్ ప్రాంతాల నుండి గుల్జార్ హౌస్ ప్రహ్లాద్ (70) ఇంటికి వచ్చారు. వీరంతా రాత్రి పొద్దుపోయే వరకు ఆటా, పాటలతో గడిపారు . పెద్దలు ముచ్చట్ల సంబరాలలో మునిగి తేలారు . రాత్రి 11 గంటల తర్వాత కొంత మంది, తర్వాత మిగిలిన వారు నిద్రకు ఉపక్రమించగా ఇదే వారికి కాలరాత్రి అవుతుందని, చివరి నిద్ర అవుతుందని వారు కలలో కూడా ఊహించలేదు. ఉదయం నిద్ర లేవగానే పిల్లలను తీసుకుని నగరంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్లాన్ చేసుకున్నారు .


వారి ప్లాన్ చెల్లా చెదురైంది. తెల్లవారు జామున సుమారు 6 గంటల ప్రాంతంలో చల్లదనం కోసం వేసుకున్న ఏసీ కంప్రెషర్ బలి తీసుకుంది. కంప్రెషర్ పేలుళ్లతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. దీనికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోడైంది. ఫలితంగా అక్కడ ఉన్న 21 మందిలో నిద్రలో ఉన్న ముగ్గురు అగ్నికీలలకు ఆహుతయ్యారు. వారి మృతదేహాలు గుర్తించలేనంతగా మంటలలో కాలిపోయాయి. మిగిలిన వారిని ఆస్పత్రులకు తరలించగా చికిత్స పొందుతూ వారిలో 14 మంది చనిపోయారు. మొత్తం మీద 17 మంది చావుకు కారణమైన అగ్ని ప్రమాదం నగరంలో అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవనాలలో నివాసముంటున్న వారి భద్రతను ప్రశ్నిస్తోంది. ఇలాంటి సంఘటనలతో మనుషుల ప్రాణాలు గాలిలో దీపంగా మారాయనేందుకు రుజువుగా మారాయి.

Next Story