నేతాజీ సేవలకు ప్రతీ భారతీయుడు గర్వపడాలి

by Yella Dhawani Reddy |

నేతాజీ సేవలకు ప్రతీ భారతీయుడు గర్వపడాలి
X

దిశ, సికింద్రాబాద్: దేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలకు ప్రతీ భారతీయుడు గర్వ పడాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఆదివారం తార్నాకలోని ఆమె క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చరిత్రలో జయంతి తప్ప, వర్ధంతి లేని మహానీయుడు, గొప్ప స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. యువతలో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని నింపిన మహనీయున్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాన్నారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story