సబ్ ఇంజనీర్ అభ్యర్థులకు న్యాయం చేయాలి.. మంత్రి సీతక్కకు అభ్యర్థులు వినతి

by Bhanu |

డిప్లొమా అర్హతతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ( ట్రాన్స్కో) 2017, డిసెంబర్ 28న 174 సబ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ ను త్వరితగతిన పూర్తి చేసి సబ్ ఇంజనీర్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ ప్రపంచ పర్యావరణ సంస్థ ఫౌండర్ డాక్టర్ సిహెచ్ భద్ర, చల్లూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సబ్ ఇంజనీర్ అభ్యర్థులు ఆదివారం రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

సబ్ ఇంజనీర్ అభ్యర్థులకు న్యాయం చేయాలి.. మంత్రి సీతక్కకు అభ్యర్థులు వినతి
X

దిశ, హిమాయత్ నగర్ : డిప్లొమా అర్హతతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ( ట్రాన్స్కో) 2017, డిసెంబర్ 28న 174 సబ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ ను త్వరితగతిన పూర్తి చేసి సబ్ ఇంజనీర్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ ప్రపంచ పర్యావరణ సంస్థ ఫౌండర్ డాక్టర్ సిహెచ్ భద్ర, చల్లూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సబ్ ఇంజనీర్ అభ్యర్థులు ఆదివారం రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు హిమాయత్ నగర్ లో మీడియాతో మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా అనేక సార్లు విద్యుత్ సౌధ చుట్టూ తిరిగి అప్పటి సీఎండీ ప్రభాకర్ రావు, సంబంధిత అధికారులను కలిసి వేడుకున్న సాగదీసే దోరణితో సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 2017 నియామక ప్రక్రియను సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 2012 నియామక ప్రక్రియతో ముడిపెట్టి జటిల సమస్యగా మార్చి మమ్మల్ని మా కుటుంబాలను మనోవేదనకు గురిచేశారని వారు అవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని అప్పటి విద్యుత్ శాఖ మంత్రి

జగదీష్ రెడ్డి, మంత్రి కేటీఆర్ కలిసి వేడుకున్న తమను పట్టించుకోలేదని వారు వెల్లడించారు. ఇప్పటి వరకు 2003లో సబ్ ఇంజనీర్ ఉద్యోగాలు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. 2017 నుండి పెండింగ్లో ఉన్న ఈ కేసును తక్షణమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుని నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని మంత్రికి విన్నవించామని తెలిపారు. ఈ విషయంపై మంత్రి సీతక్క స్పందిస్తూ సబ్ ఇంజనీర్ల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల దృష్టికి తీసుకువెళ్లి న్యాయపరమైన సమస్యలకు ప్రభుత్వం నుండి న్యాయం జరిగేలా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారని వారు వెల్లడించారు. మంత్రిని కలిసినవారిలో చల్లూరి రాంబాబు, జైద శివకుమార్, పి. ప్రహ్లాద్, జూపాక శ్రీనివాస్, ఎంఎస్ఆర్, ప్రముఖ రచయిత కరీం తదితరులు ఉన్నారు.


Next Story