Osmania University : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ధర్నా

by Muthe.Rajitha |

ఉస్మానియా యూనివర్సిటీ(Osmania Univesrity)లో విద్యార్థులు ఆందోళన(Students Protest) బాట పట్టారు.

Osmania University : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్ : ఉస్మానియా యూనివర్సిటీ(Osmania Univesrity)లో విద్యార్థులు ఆందోళన(Students Protest) బాట పట్టారు. చీకట్లో సైతం నిరసనలు కొనసాగిస్తూ.. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ను ముట్టడించారు. ఓయూ పరిధిలో పీజీసెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎలాగైనా పరీక్షలు వాయిదా వేయాల్సిందే అంటూ మధ్యాహ్నం నుండి సైన్స్ విభాగం విద్యార్థులు(Science Students) ధర్నాకు దిగారు. తమకు నెట్, సెట్ పరీక్షలు ఉన్నాయని.. అవి పూర్తయ్యే వరకు పీజీ పరీక్షలు వాయిదా వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం బహిష్కరించి మరీ ఆందోళన బాట పట్టిన విద్యార్థులు రాత్రి భోజన సమయం వరకు కూడా తమ నిరసన కొనసాగిస్తున్నారు. అదే సమయంలో విద్యార్థులు ర్యాలీగా వెళ్ళి ఓయూ పరిపాలన విభాగం భవనాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు.

Next Story