National Science Day: చిన్నారి వినూత్న ప్రదర్శన (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-28 14:53:10  IST  )

నేషనల్ సైన్స్ డే(National Science Day) సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫేర్‌లో ఓ విద్యార్థిని ప్రదర్శన వినూత్నంగా అందరినీ ఆకట్టుకున్నది.

National Science Day: చిన్నారి వినూత్న ప్రదర్శన (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ సైన్స్ డే(National Science Day) సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫేర్‌లో ఓ విద్యార్థిని ప్రదర్శన వినూత్నంగా అందరినీ ఆకట్టుకున్నది. బల్బుకు ఫ్యాన్ రెగ్యూలేటర్‌ను ఏర్పాటు చేసి ఓ వినూత్న ప్రయత్నం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు స్కూల్‌లో శుక్రవారం నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఫేర్ నిర్వహించారు. నాలుగో తరగతి విద్యార్థిని శణ్వీక(Student Shanveeka) చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బల్బుల వినియోగంలో విద్యుత్తు ఆదాపై చేసిన ప్రయోగం(Student Innovative Presentation) అందరికీ అవగాహన కలిగించింది. ఫ్యాన్ స్పీడ్ పెంచుకునేందుకు ఉపయోగించే రెగ్యూలేటర్ సహయంతో బల్బుల కూడా వినియోగించుకొవచ్చని ప్రయోగంలో ప్రదర్శించింది. బల్బులో కూడా ఎంత మేరకు లైటింగ్ ఎంచుకోవాలో విద్యుత్తు వినియోగం ఏ విధంగా చేసుకొవచ్చో వివరించింది. వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి : https://youtube.com/shorts/aQkNO1LgI-Y

Next Story