లా సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి : విద్యార్థి సంఘాలు

by Naga Rani Yarlagadda |

ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

లా సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి : విద్యార్థి సంఘాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వివిధ జాతీయ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు ఉన్న తేదీల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు, అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవుతారని, రెండు పరీక్షలు ఒకే రోజు ఎలా రాస్తారని వర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగానికి చెందిన 3, 4, 5, 6వ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ఈనెల 18 నుంచి మొదలు కానున్నాయి. అయితే జూన్ 21వ తేదీన UGC నెట్ పరీక్షతో పాటు, సివిల్ జడ్జ్ మెయిన్స్, హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ పరీక్షలు ఉన్నాయి. ఆయా పరీక్షలు జిల్లా కేంద్రాల్లో ఉండగా.. అక్కడ ఆ పరీక్షలు రాసి, మళ్ళీ హైదరాబాద్ కు ఎప్పుడు చేరుకొని సెమిస్టర్ పరీక్షలు రాస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. UGC నెట్, సివిల్ జడ్జ్ మెయిన్స్, హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ పరీక్షలు అభ్యర్థులకు కీలకమైనవి కావడంతో న్యాయశాస్త్రానికి విభాగంలోని సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను కోరుతున్నారు.

Next Story