- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం వెళ్తున్న ఐటిఐ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.

దిశ, సికింద్రాబాద్: ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం వెళ్తున్న ఐటిఐ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ప్రకారం.. ఐడిహెచ్ కాలనీ న్యూ బోయిగూడ ప్రాంతానికి చెందిన డి అభిషేక్(19) ఆర్టీసి ఎక్స్ రోడ్డు వద్ద ఐటిఐ చదువుతున్నాడు. గత నాలుగు రోజుల నుంచి ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం దిల్సుఖ్నగర్ వెళుతున్నాడు. ఈ క్రమంలో ఉదయం 8-30 గంటలకు అభిషేక్ తన స్నేహితుడితో కలిసి (టిజి10సి2805) కెటిఎం ద్విచక్ర వాహనంపై దిల్సుఖ్నగర్ క్కు వెళ్లాడు. ప్రాక్టికల్ ట్రైనింగ్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో మద్యాహ్నం 1-30 ప్రాంతంలో మాణికేశ్వర్నగర్ కమాన్ వద్దకు రాగానే రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం డ్రైవ్ చేస్తున్నా అభిషేక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు 108 అంబులెన్స్ పారామెడికల్ సిబ్బంది ధృవీకరించారు. వెనకాల కూర్చున్న అతని స్నేహితునికి సైతం గాయాలు అయ్యాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. మృతుడి తల్లి శిరీష(38)ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం మానికేశ్వరి నగర్ కమాన్ వద్దకు రాగానే వెనకాల నుండి వేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనం వేగంగా చెట్టుకు ఢీకొని ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.






