- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా శక్తికి తిరుగులేదు : మంత్రి సీతక్క
మహిళలు తలచుకుంటే అసాధ్యాలు కూడా సులభ సాధ్యాలవుతాయని, అందుకు ఎందరో మహిళల విజయాలు మన కళ్ల ముందే నిదర్శనంగా నిలుస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు.

దిశ, శేరిలింగంపల్లి : మహిళలు తలచుకుంటే అసాధ్యాలు కూడా సులభ సాధ్యాలవుతాయని, అందుకు ఎందరో మహిళల విజయాలు మన కళ్ల ముందే నిదర్శనంగా నిలుస్తున్నాయని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా– శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ చాంబర్ ఆఫ్ ఇవెంట్స్ ఇండస్ట్రీ (టీసిఇఐ) ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్టాత్మక 7వ ఎడిషన్ స్త్రీ శక్తి అవార్డ్స్ 2025 కార్యక్రమం సోమవారం మాదాపూర్ హెచ్ ఐసీసీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క స్త్రీ శక్తి అవార్డుల ప్రధానోత్సవాన్ని ప్రారంభించారు. స్త్రీ శక్తి అవార్డులకు ఎంపికైన వారికి అవార్డులను బహుకరించి, ఘనంగా సత్కరించారు. మహిళ సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ముఖ్యంగా ఇందిరా మహిళ శక్తి పథకం వంటి వాటి గురించి ప్రస్తావించారు. మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వంత ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సృజనాత్మక పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. స్త్రీ శక్తి అవార్డ్స్ వంటి కార్యక్రమాలు మహిళలు ఉన్నత స్థానాల్లోకి రావడానికి దోహదపడతాయని అన్నారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ, గ్రామీణ మహిళా ఉద్దీపనకర్తల గుర్తింపులో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని అన్నారు. టీసీఇఐతో కలిసి సెర్ప్ ఆధ్వర్యంలో మహిళలకు ఈవెంట్ మేనేజర్లుగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీసీఇఐ అధ్యక్షుడు బలరాం బాబు, స్ట్రీ శక్తి అవార్డ్స్ కన్వీనర్ మిల్లెట్ బ్యాంక్ వ్యవస్థాపకురాలు విశాలరెడ్డి, తెలంగాణ టూరిజంకు చెందిన ప్రకాశ్ రెడ్డి (ఐపీఎస్ ), టూరిజం శాఖ డైరెక్టర్, జడ్. హనుమంత్ కొండిబా (ఐఎఎస్ ), కింగ్‌డమ్ ఆఫ్ లెసోతో హానరరీ కాన్సుల్, సురత్ సింగ్ మల్హోత్రా, హెచ్‌వైఎస్‌ఇఎ అధ్యక్షుడు ప్రశాంత్ నదేంద్ల, ఫిక్కి చైర్‌పర్సన్, ప్రతిభా కుందా, యునైటెడ్ వే హైదరాబాద్ చైర్‌పర్సన్ బోర్డ్ మెంబర్ డాక్టర్ కిరణ్మయి పెమ్మసాని పెండ్యాల, ఫీనిక్స్ గ్రూప్, ఎవిపి డిజైన్ విభాగంకు చెందిన హర్షిత అట్లూరి, రైనా సోషల్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ డైరెక్టర్ సంగీతా వర్మ తదితరులు హాజరయ్యారు.
4 విభాగాల్లో 50 మంది అవార్డు గ్రహీతలు
అసాధారణ మహిళలకు అందించే స్త్రీ శక్తి అవార్డ్స్ 2025 కోసం దేశవ్యాప్తంగా 250 మందికి పైగా మహిళలు దరఖాస్తు చేయగా.. 4 విభాగాల్లో 50 మంది మహిళలు ఎంపికయ్యారు. అత్యున్నత గౌరవమైన స్త్రీ రత్న, స్త్రీ మూర్తి, స్త్రీ శక్తి, ప్రత్యేక ఎస్ హెచ్ జీ మహిళా విభాగం అవార్డును అందజేశారు. దేశవ్యాప్తంగా 15 ఏళ్లకు పైగా హాస్పిటాలిటీ, సృజనాత్మక కళలు, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేష సేవలు అందించిన మహిళా ప్రముఖులు రాజనీ నాయర్ డెబ్, మాలిని దివాకల, పుష్ప భాస్కర్, వాణి తమ్మయగారి, మాలిని ఎల్. నరసింహన్‌లకు స్త్రీరత్న అవార్డులకు ఎంపికయ్యారు.






