- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంసీహెచ్ కాలనీలో వీధి కుక్కల బెడద..
పాత మలక్‌పేట్‌లోని ఎంసీహెచ్ కాలనీలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, చంపాపేట్, జూలై 12: పాత మలక్‌పేట్‌లోని ఎంసీహెచ్ కాలనీలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో కుక్కల సంఖ్య అధికంగా పెరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇటీవల కాలనీలో ఓ వ్యక్తిపై వీధి కుక్క దాడి చేసి కరవడంతో స్థానికుల్లో మరింత భయం నెలకొంది. వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ పాదచారులు, ద్విచక్ర వాహనదారులను వెంటాడటం, దూకుడుగా మొరగడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోయారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు పేర్కొన్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి వీధి కుక్కలను పట్టుకుని, వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేపట్టడంతో పాటు ప్రజల భద్రతకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని కోరారు. వీధి కుక్కల బెడదను అత్యవసర సమస్యగా పరిగణించి, ఎంసీహెచ్ కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను విజ్ఞప్తి చేశారు.






