- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటళ్లలో నాణ్యతలేని ఆహారం..ప్రజల ప్రాణాలతో చెలగాటం
నగరంలో హోటళ్లు, రెస్టారెంట్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది.

ప్రజల ప్రాణాలతో చెలగాటం
- హోటళ్లలో నాణ్యతలేని ఆహారం
- అపరిశుభ్రతకు నిలయంగా వంటగదులు
- నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు
దిశ, కార్వాన్ : నగరంలో హోటళ్లు, రెస్టారెంట్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. సామాన్య ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని, కొన్ని యాజమాన్యాలు నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తూ కాసుల వేటలో పడ్డాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా, సంబంధిత అధికారులు మాత్రం కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అపరిశుభ్రతకు నిలయాలుగా వంటశాలలు..
నగరంలోని పలు హోటళ్లలో వంటశాలల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కుళ్లిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసం, నాణ్యత లేని నూనెలను ఇష్టానుసారంగా వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆహారంలో పురుగులు..
లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న కొన్ని హోటళ్లు, కనీస పరిశుభ్రత పాటించడం లేదనే విమర్శలు ఉత్పన్నమవుతున్నాయి. పురుగులు పడిన ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్, గ్యాస్ట్రో ఎంటరైటిస్ వంటి తీవ్ర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇటీవల నాంపల్లిలోని ఓ హోటల్ సాంబారులో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నప్పటికీ, జరిమానాలతో సరిపెడుతుండడంతో యాజమాన్యాల్లో మార్పు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్యాస్ కొరతతో ఇబ్బందులు..
గ్యాస్ సిలిండర్ల కొరతతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. హోటల్స్, రెస్టారెంట్స్ యాజమాన్యాలు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పలు హోటల్స్, రెస్టారెంట్స్ లో నాసిరకం ఆహారం సరఫరా చేస్తూ ధరలు పెంచి బిజినెస్ జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిత్యం ఫుడ్ సేఫ్టీ, జీహెచ్ ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉత్పన్నమవుతున్నాయి.
- Tags
- food
- hotel food






