- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాలకు మీనాక్షి.. తొలుత ఖమ్మం.. ఆ తర్వాత..!
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ జిల్లాల బాట పట్టారు..

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ జిల్లాల బాట పట్టారు. జిల్లాల పర్యటనలో భాగంగా మొదటిగా ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలు నిర్వహిస్తారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ సంస్థాగత కమిటీల నియామకానికి సమావేశాల నిర్వహణ, నాయకుల మధ్య సమన్వయం తదితర వాటిపై సమీక్షిస్తారు. శుక్రవారం రాత్రి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో కలిసి ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం కిన్నెరసాని ప్రాజక్టు వద్ద ఆదివాసీ విభాగానికి జరుగుతున్న సమావేశాలకు ఆమె హాజరవుతారు. ఆ సమావేశం అనంతరం శనివారం ఉదయం 11 గంటల నుంచి ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్షిస్తారు.
ఈ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు , ముఖ్య నాయకులు, పరిశీలకులకు సమాచారం అందించారు. ఈ సమావేశాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ లు బలరాం నాయక్, రఘురామ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులు హాజరవుతారు. మీనాక్షి సమీక్ష సమావేశాలు, వన్ టు వన్ సమావేశాలు నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే మిగిలిన జిల్లాల్లోనూ ఆమె పర్యటించనున్నారని సమాచారం. జూన్ 5వ తేదీ వరకు ఆమె రాష్ట్రంలోనే ఉండనున్నారు.






