Breaking News : శ్రీచైతన్య విద్యాసంస్థలకు భారీ షాకిచ్చిన ప్రభుత్వం

by Muthe.Rajitha |

హైదరాబాద్‌ మాదాపూర్‌‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల(Sri Chaithanya Institutions)కు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్(Food Safty Department) రద్దు చేసింది.

Breaking News : శ్రీచైతన్య విద్యాసంస్థలకు భారీ షాకిచ్చిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ మాదాపూర్‌‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల(Sri Chaithanya Institutions)కు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్(Food Safty Department) రద్దు చేసింది. కిచెన్‌లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట తయారు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వేల మందికి భోజనాన్ని తయారు చేస్తున్న కిచెన్‌ అపరిశుభ్రంగా ఉండటంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్‌లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. సుమారు 125 కిలోల గడువు తీరిన(expired) ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు.

బియ్యం, కూరగాయలు, పప్పుదినుసులను అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు. కిచెన్‌, స్టోర్ రూమ్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు, కిచెన్‌ను సీజ్ చేయాలని, ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు అధికారులు మాదాపూర్‌‌(ఖానామెట్‌)లోని చైతన్య విద్యా సంస్థల సెంట్రల్‌ కిచెన్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కిచెన్‌లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట తయారు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story