- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఫేక్ గ్యాస్ డీలర్’ దందా..? బోర్డు పెట్టి భారీగా కమర్షియల్ సిలిండర్ల నిల్వలు
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో వంట గ్యాస్ కొరత రోజురోజుకే పెరుగుతున్నది.

‘ఫేక్ గ్యాస్ డీలర్’ దందా..?
- బోర్డు పెట్టి భారీగా కమర్షియల్ సిలిండర్ల నిల్వలు
- ఇక్కడి నుంచి రోజూ ఆటోల్లో వివిధ ప్రాంతాలకు తరలింపు
- ఫిర్యాదు చేసినా స్పందించని సివిల్ సప్లై అధికారులు
- స్థానికుల్లో ఆందోళన.. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
దిశ, వనస్థలిపురం : ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో వంట గ్యాస్ కొరత రోజురోజుకే పెరుగుతున్నది. వినియోగదారులు ఏజెన్సీల వద్ద బారులు తీరాల్సి వస్తున్నది. ఈ అత్యవసర పరిస్థితులను కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ పరిధిలోని.. మన్సూరాబాద్ డివిజన్‌లో గ్యాస్ దందా వెలుగులోకి వచ్చింది. సాయి సప్తగిరి 5వ క్రాస్ రోడ్డులో ‘తెలంగాణ గ్యాస్’ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి, ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి పంపిణీ చేస్తున్న ఘటన స్థానికులను కలవరపెడుతున్నది. ప్రతిరోజూ దాదాపు 2 నుంచి 3 ఆటోల ద్వారా వివిధ కంపెనీలకు చెందిన కమర్షియల్ సిలిండర్లను తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకవైపు భారీ ఎత్తున సిలిండర్ల స్టాక్ ఉంచి, మరోవైపు సరఫరా కొనసాగించడంతో ఇది పూర్తిగా అనధికార కార్యకలాపమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ‘తెలంగాణ గ్యాస్’ పేరుతో ఉన్న ఈ కేంద్రం ఏ గ్యాస్ కంపెనీకి సంబంధించిన అధికారిక డీలర్ కాదని స్థానికులు చెబుతున్నారు.
విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం..
ఈ వ్యవహారంపై రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన సరిగా లేకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా ‘వెంటనే విజిలెన్స్ అధికారులను పంపిస్తాను’ అని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, విజిలెన్స్ అధికారిని సంప్రదిస్తే ‘ప్రస్తుతం నాకు సమయం లేదు.. తరువాత వస్తాను’ అని చెప్పడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిణామాలు అధికారుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా పౌరుల ఫిర్యాదులను పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్రమ గ్యాస్ నిల్వలు ప్రమాదకరమని, వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
- Tags
- gas cylinders
- gas






