- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవ అక్రమ రమణా నియంత్రణ కోసం ముస్కాన్ 12 పేరుతో ప్రత్యేక కార్యాచరణ
తప్పిపోయిన పిల్లలను రక్షించడం కోసం ఆపరేషన్ ముస్కాన్-12 పేరుతో సైబరాబాద్ పోలీసులు కార్యాచరణ రూపొందించారు.

దిశ, శేరిలింగంపల్లి : తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, భిక్షాటన, పాత వస్తువులు ఏరుకోవడం, బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించడం,బాలల అక్రమ రవాణా, వెట్టిచాకిరి నుండి పిల్లలను రక్షించడం కోసం ఆపరేషన్ ముస్కాన్-12 పేరుతో సైబరాబాద్ పోలీసులు కార్యాచరణ రూపొందించారు. నిరాశ్రయులైన పిల్లలను గుర్తించడానికి సైబరాబాద్ పోలీసులు పోలీసులు 1 జూలై నుండి 31 జూలై, వరకు “ఆపరేషన్ ముస్కాన్-12”ను ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్‌తో సహా సబ్ ఇన్‌స్పెక్టర్, నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి, డీసీపీ (మహిళలు & బాలల భద్రతా విభాగం) కె. సృజన మాట్లాడుతూ, "తప్పిపోయిన పిల్లలు, గుర్తు తెలియని పిల్లలు, వివిధ కారణాల వల్ల తమ కుటుంబాల నుంచి విడిపోయిన పిల్లలను గుర్తించడానికి మేము 'దర్పణ్' అనే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తామని తెలిపారు.ఈ బృందాల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాము.సంబంధిత శాఖల అధికారుల సహకారంతో 'ఆపరేషన్ ముస్కాన్-12' జూలై నెలాఖరు వరకు కొనసాగుతుందని ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ పి. యదయ్య గౌడ్ తెలిపారు.గతంలో కేసుల డేటా ఆధారంగా, పిల్లలను బలవంతపు కార్మిక వ్యవస్థలోకి నెట్టిన ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ఈ బృందాలు సంబంధిత శాఖల తో కలిసి రక్షణ,పునరావాస కల్పనకు కృషి చేస్తారు.ఈ సమావేశంలో ఏసీబీ ఎస్. కృష్ణ ప్రసాద్, మహిళలు & బాలల సంక్షేమం అధికారులు రాజారెడ్డి, డి. సాహితీ, సహాయ కార్మిక కమిషనర్ ప్రవీణ్ కుమార్, జిల్లా బాలల రక్షణ అధికారి, ఇంతియాజ్, రత్నం, జి.హలీం తదితరులు పాల్గొన్నారు.






