- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 07న ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక ఐడీ, ఆధార్ నమోదు శిబిరం
ట్రాన్స్‌జెండర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ జిల్లాలో ప్రత్యేక ఐడీ , ఆధార్ నమోదు శిబిరం ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నట్టు సహాయ సంచాలకులు రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో: ట్రాన్స్‌జెండర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ జిల్లాలో ప్రత్యేక ఐడీ , ఆధార్ నమోదు శిబిరం ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నట్టు సహాయ సంచాలకులు రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి అంబర్ పేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఆడిటోరియం లో నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ శిబిరంలో ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డు , ఆధార్ నమోదు , సవరణలు, సంబంధిత ప్రభుత్వ సేవలపై అవగాహన, వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 150 నుంచి 200 మంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు లబ్ధి పొందనున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు . హైదరాబాద్ జిల్లాలో నివసిస్తున్న ట్రాన్స్‌జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అవసరమైన పత్రాలతో శిబిరానికి హాజరై సేవలను పొందాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ హరిచందన దాసరి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.






