అంతస్తులు పెరిగినా..ట్యాక్సులు పెరగవు

by velandi.Saikiran |

మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోయినపల్లి సర్కిల్ పరిధిలోని మోండా డివిజన్ మారేడుపల్లి, రెజిమెంటల్ బజార్, మోండా ప్రాంతాల్లో అధిక శాతం హోటళ్లు, లాడ్జీలు కొనసాగుతున్నాయి.

అంతస్తులు పెరిగినా..ట్యాక్సులు పెరగవు
X

అంతస్తులు పెరిగినా..ట్యాక్సులు పెరగవు

- ట్యాక్సు సవరణ కొందరికే వర్తింపు

- మరికొందరికి మినహాయింపు

దిశ, బేగంపేట : ఒకదానిపై ఒకటి అంతస్తులు పెరుగుతాయి.. లక్షల ఆదాయం ఆర్జిస్తారు.. కానీ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ చెల్లించాల్సిన.. కట్టాల్సిన ప్రాపర్టీ ట్యాక్సులు మాత్రం వసూళ్లు కావడం లేదు. ఒకవైపు అక్రమ నిర్మాణాలతో టౌన్ ప్లానింగ్ ద్వారా రావాల్సిన డబ్బు అధికారుల జేబుల్లోకి వెళుతుండగా ఏళ్ల తరబడి ట్యాక్సులు వసూళ్లు చేయకుండా ట్యాక్స్ విభాగం అధికారులు, సిబ్బంది చోద్యం చూస్తున్నారు. ఇలా లక్షల రూపాయల ఆదాయం కార్పొరేషన్ కోల్పోతున్నా ఉన్నతాధికారులు కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు.

కోట్లలో సంపాదన.. మున్సిపాలిటీకి గుండు సున్నా..

మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోయినపల్లి సర్కిల్ పరిధిలోని మోండా డివిజన్ మారేడుపల్లి, రెజిమెంటల్ బజార్, మోండా ప్రాంతాల్లో అధిక శాతం హోటళ్లు, లాడ్జీలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ హోటళ్లు, వాణిజ్య భవనాలు నిర్మాణాలు చేసే సమయంలోనే అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు అధికారులు 100 శాతం ట్యాక్సును పెనాల్టీగా విధించాల్సి ఉంటుంది. ట్యాక్సు విభాగం అధికారులు కొంత మంది వారితో కుమ్మక్కై అక్రమ నిర్మాణాలకు ట్యాక్స్ లేకుండా మినహాయింపు ఇస్తున్నారు. కొన్ని ఏళ్ల తరబడి లక్షల రూపాయలు ట్యాక్సుల రూపంలో బల్దియాకు రావాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా వసూళ్ల కావడం లేదు. ఇక ప్రతి ఏడాది ట్యాక్సు రివిజన్ చేయాల్సి ఉంటుంది. పెరిగిన ట్యాక్సును వర్తింపజేయడంతో పాటు పాత భవనాలపై కొత్తగా నిర్మిస్తే వంద శాతం పెనాల్టీతో కొత్త ట్యాక్సు వేయాల్సి ఉంది. కానీ మోండా డివిజన్ పరిధిలో అధికారులు ట్యాక్సు సవరణల గురించి అసలు పట్టించుకోవడమే మరిచిపోయారు.

ఆదేశాలు బేఖాతర్..

జీహెచ్ఎంసీలో ఇటీవల టాక్స్ సవరణలు చేయాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇక్కడి కార్పొరేషన్ అధికారులు మాత్రం దీన్ని అమలు చేయడం లేదు. హోటళ్లు, వాణిజ్య భవనాల యజమానులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా ఏడాదికి వేలల్లో చెల్లించాల్సిన ట్యాక్సులకు మాత్రం పంగనామం పెడుతున్నారు. ఉదాహరణకు మనోహర్ థియేటర్ వెనుక ఉండే న్యూ పంచవటి లాడ్జికి గ్రౌండ్ పాటు రెండంతస్తులకు అనుమతులు ఉన్నాయి. కానీ అదనంగా రెండంతస్తులు నిర్మించినా వాటికి ట్యాక్సు విధించడం లేదు. సెల్లార్ అసలు పట్టించుకోవడం లేదు. మచ్చుకు ఇదకటే.. కానీ ఇలాంటివి వందల్లో ఉన్నాయి. కానీ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.

Next Story