- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూదాన భూమి కేటాయింపుల్లో కొందరూ అక్రమాలకు పాల్పడ్డారు
భూదాన భూమి కేటాయింపులో గ్రామీణ పేదల సంఘంలోని కొందరు అనేక అక్రమాలకు పాల్పడ్డారని వెలుగుమట్ల భూములసాధన కమిటీ గౌరవ సలహాదారుడు జి. సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు.

దిశ, ఖైరతాబాద్ : భూదాన భూమి కేటాయింపులో గ్రామీణ పేదల సంఘంలోని కొందరు అనేక అక్రమాలకు పాల్పడ్డారని వెలుగుమట్ల భూములసాధన కమిటీ గౌరవ సలహాదారుడు జి. సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో వెలుగు మట్లలో కూల్చివేసిన గృహాల్లో 720 ఇళ్లలో 300 తాత్కాలిక షెడ్లు ఉన్నాయని, ఆ షెడ్లను గ్రామీణ పేదల సంఘం పేరిట డబ్బులు తీసుకొని కేటాయించారని ఆరోపించారు. ప్రభుత్వం మార్చి 11720 ఇళ్లకు 492.09 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని, మిగతా వారికి ఇప్పటి వరకు స్థలం చూపించలేదన్నారు. దీంతో బాధితులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. 2019 నుంచి గ్రామీణ పేదల సంఘం పేరుతో కొందరు భూధాన భూముల్లో స్థలాలు ఇప్పిస్తామంటూ భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారన్నారు.
సుమారు రూ.20 కోట్ల వరకు వసూలు చేశారని, ప్రస్తుతం 300 ఇండ్లు అలా వసూలు చేసి కేటాయించినవేనని తెలిపారు. సంఘంలోని ఓ వ్యక్తి 15 మందితో ముఠాను తయారు చేసి ఈ దందాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వెలుగుమట్ల భూ బాధితురాలు నల్లబెల్లి కవిత మాట్లాడుతూ రూ.10లక్షల వరకు ఖర్చు చేసి ఇళ్లు కట్టుకున్నాయని, ఇక్కడ ఉపాధి లేకపోవడంతో ఇంటికి తాళం వేసి ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లామన్నారు. దీంతో గ్రామీణ పేదల సంఘంలోని కొందరు తమ ఇంటిని ఆక్రమించి ఇతరులకు విక్రయించేందుకు యత్నించారన్నారు. దానిని అడ్డుకోబోయిన తన భర్తపై దాడి చేశారన్నారు. కమిటీ సభ్యుడు కోటేశ్వర్ రావు మాట్లాడుతూ ఒక్కొ ఇంటికి రూ.రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేశారని, ప్రస్తుతం పేదల పక్షాన పోరాడుతున్నట్లు నటిస్తున్నారని, అందులో అరెస్టయిన వారికి జైలులో సకల రాజ మర్యాదలు అందుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహరంపై ప్రభుత్వం విచారణ జరిపించి, అర్హులైన పేదలందరికీ వంద గజాల్లో ఇళ్లు కట్టించి ఇవ్వాలని, లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటాలకు వెనుకాడమని తెలిపారు.






