- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాగునీరు, డ్రైనేజీ సమస్యలు తీర్చండి
కొత్తపేట డివిజన్ పరిధిలోని కాలనీలలో పాత డ్రైనేజీ వ్యవస్థను మార్చి నూతన డ్రైనేజీ లైన్ లను ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ పవన్ కుమార్ కోరారు.

దిశ, చైతన్య పురి: కొత్తపేట డివిజన్ పరిధిలోని కాలనీలలో పాత డ్రైనేజీ వ్యవస్థను మార్చి నూతన డ్రైనేజీ లైన్ లను ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ పవన్ కుమార్ కోరారు. ఈ మేరకు సోమవారం జలమండలి జనరల్ మేనేజర్ బలరాం ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో అనేకమైన కాలనీలో డ్రైనేజీ మాన్ హోల్స్ చెడిపోయాయని, వాటిపైన మాన్ హోల్ కవర్లు కూడా చెడిపోవడంతో.. వెంటనే వాటిని మరమ్మత్తులు చేయించాలని కోరారు. రాజీవ్ గాంధీ నగర్ ఫేస్ 1లో ప్రజలకు సరైనటువంటి త్రాగునీటి సౌకర్యం లేదని, కాలనీ త్రాగు నీరు రాకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే నూతన త్రాగు నీటి లైన్ ఏర్పాటు చేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని, జిఎం బలరామ్ ను అక్కడే ఉన్న డిజిఎం రవీందర్ వర్మ, ఏఈ శ్రవంతి రెడ్డిలకు సూచించారు. ఈయనతో పాటు నాయకులు మంచి రాజేష్, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.






