- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుర్ర అశోక్ కుమార్ గౌడ్ కు 'సోలార్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డ్'
తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్ర అశోక్ కుమార్ గౌడ్ ను మరో అవార్డ్ వరించింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్ర అశోక్ కుమార్ గౌడ్ ను మరో అవార్డ్ వరించింది. గత 25 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సోలార్ ఇండస్ట్రీ కోసం చేస్తున్న నిరంతర కృషిని గుర్తించి రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆయనకు 'సోలార్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ' అవార్డ్ బహుకరించాయి. ఆదివారం తెలంగాణ టూరిజం భవన్లో జరిగిన సోలార్ టెక్నికల్ సెమినార్లో తెలంగాణ రెన్యువబుల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, TGSPDCL సంస్థలకు చెందిన నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాతికేళ్ళ నుంచి రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తున్న తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్ర అశోక్ కుమార్ గౌడ్ కు 'సోలార్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ' అవార్డును అందించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రెన్యువబుల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జీఎం ప్రసాద్, TGSPDCL CGM చక్రపాణితోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోలార్ ఇంటిగ్రేటర్స్, సోలార్ మ్యానుఫాక్చరర్స్, వివిధ రాష్ట్రాల డీలర్స్ పాల్గొనడం జరిగింది.






