పెళ్లి పై నిరాశ..లైఫ్‌లో లాగౌట్ అయిన ఐటీ ప్రొఫెషనల్!

by Bhanu |   (  Updated:2025-06-25 13:16:05  IST  )

పెళ్లి సంబంధిత విషయాల్లో వచ్చిన నిరాశతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పెళ్లి పై నిరాశ..లైఫ్‌లో లాగౌట్ అయిన ఐటీ ప్రొఫెషనల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : పెళ్లి సంబంధిత విషయాల్లో వచ్చిన నిరాశతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హఫీజ్‌పేటలోని లక్ష్మీప్రియ అపార్ట్‌మెంట్‌లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న అనిల్ అమిత్ చౌద్ (30), నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అనిల్ కు ఇటీవల ఓ యువతితో ఎంగేజ్మెంట్ జరగగా నవంబర్ లో వివాహం జరగనుంది.

అయితే, వివాహానికి ముందు వచ్చిన కొన్ని వ్యక్తిగత సమస్యలు, ఆందోళనలు కారణంగా అనిల్ మానసికంగా బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి గదిలోకి వెళ్లిన అతను ఉదయానికల్లా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా, సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతున్న అనిల్ మృతదేహాన్ని గుర్తించారు.

వెంటనే మియాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.తన పెళ్లి విషయంలో కొంతకాలంగా తీవ్రంగా బాధపడుతున్నట్టు అనిల్ తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.

Next Story