- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా మాంజా.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు తీవ్ర గాయాలు
by Muthe.Rajitha |
హైదరాబాద్‌లో చైనా మాంజా వల్ల మరో ఘోర ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో చైనా మాంజా వల్ల మరో ఘోర ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేటకు బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చైతన్యకు రోడ్డుపై గాల్లో వేలాడుతున్న చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. మాంజా చేతికి బలంగా చుట్టుకుని కత్తిలా కోసుకోవడంతో చైతన్య తీవ్రంగా కోసుకుపోయింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అతన్ని మాదాపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. చైనా మాంజా వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా ఉపయోగిస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. పతంగులు ఎగురవేసే సమయంలో మాంజా తెగి రోడ్లపై, గాలిలో వేలాడుతుండటంతో బైక్, స్కూటర్‌పై వెళ్లేవారికి చుట్టుకుని ప్రాణాపాయంగా మారుతోంది. అధికారులు నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని, ప్రజలు కూడా చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా మానుకోవాలని కోరుతున్నారు.
Next Story






