- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం తాగి వాహనం నడిపితే ఆరు నెలలు జైలుకే
మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా తప్పదని జవహర్ నగర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శివశంకర్ హెచ్చరించారు.

దిశ, దమ్మాయిగూడ : మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా తప్పదని జవహర్ నగర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ హెచ్చరించారు. జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి దమ్మాయిగూడలో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాన్ని నడపవద్దని, ఆరోగ్యం, ప్రాణం... రెండు మీ చేతుల్లోనే ఉన్నాయని, విలువైన జీవితాన్ని నాశనం చేసుకుని కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగల్చవద్దని అన్నారు. సమాజంలో 70శాతం మరణాలు రోడ్డు ప్రమాదాల కారణంగానే జరుగుతున్నాయని, మద్యం మత్తులో నడిపినవారే అత్యధికంగా చనిపోతున్నారని తెలిపారు. మద్యంతాగి వాహనం నడిపి ఇతర వ్యక్తుల మరణానికి కారణమైతే వారే శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 54మంది డ్రైవర్లు పట్టుపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.






